తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 11 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మే 18 నుంచి 20 వరకు ఓఎస్ఎస్సీ, ఒకేషనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది.
- మే 11న ప్రథమ భాష (ఫస్ట్ లాంగ్వేజ్)
- 12న ద్వితీయ భాష (సెకండ్ లాగ్వేంజ్)
- 13న ఇంగ్లీష్
- 14న గణితం
- 16న సామాన్య శాస్త్రం (Physics & biology)
- 17న సాంఘిక శాస్త్రం (Social)
- 18న ఓఎస్ఎస్సీ పేపర్-1 (Sanskrit & Arabic)
- 19న పేపర్-2 (Sanskrit & Arabic)
- 20న ఒకేషనల్
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ ఏడాది సైతం 11 పేపర్లకు బదులుగా ఆరు పరీక్షలే నిర్వహించనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. సామాన్య శాస్త్రం పరీక్షలో భౌతిక శాస్త్రం, జీవశాస్త్రానికి వేర్వేరు సమాధాన పత్రాలు ఇవ్వనున్నారు. సిలబస్లో 70 శాతం నుంచే ప్రశ్నాపత్రం ఉంటుందని ఎస్ఎస్సీ బోర్డు తెలిపింది.
ఏప్రిల్లో ఇంటర్ పరీక్షలు..
ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ నెలలోనే జరగనున్నాయి. మే నెలలో పరీక్షలు జరపాలని భావించినప్పటికీ.. ఏప్రిల్ 20 నుంచి పరీక్షల షెడ్యూలు ఖరారు చేశారు. ఏప్రిల్ 20 నుంచి మే 9 వరకు మొదటి సంవత్సరం.. ఏప్రిల్ 21 నుంచి మే 10 వరకు రెండో సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ప్రధాన పరీక్షలు మే 5 నాటికే ముగియనున్నాయి. అప్పటికి ఎండ తీవ్రత పెరగనున్నందున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇదీచూడండి:Inter Exams Schedule: ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇదే..