పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు విడుదల - తెలంగాణ పదో తరగతి పరీక్ష వార్తలు
14:25 June 22
పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు విడుదల
పదో తరగతి విద్యార్థులకు ఎస్‌ఎస్‌సీ బోర్డు.. గ్రేడ్లు ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,84,908 మంది విద్యార్థులను పాస్ చేశారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల ప్రాతిపదికన గ్రేడ్‌లను నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులు తమ గ్రేడ్ల వివరాలను www.bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి పొందవచ్చునని మంత్రి వివరించారు.
మెమోలు పాఠశాలలో తీసుకోవాలని మంత్రి తెలిపారు. మెమోల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పంపించాలని మంత్రి సబితా తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమ శక్తి , సామర్థ్యాలు, అభిరుచులకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకొని భవిష్యత్‌ను బంగారు మయం చేసుకోవాలని మంత్రి సూచించారు.