తెలంగాణ

telangana

ETV Bharat / city

TELANGANA SONA RICE: మార్కెట్లోకి తెలంగాణ సోనా రకం బియ్యం.. దశలవారీగా రాష్ట్రమంతా విస్తరణ - తెలంగాణ వార్తలు

మధుమేహం అదుపులో ఉంచే అధిక పోషకాలున్న తెలంగాణ సోనా వరి రకం బియ్యం మార్కెట్‌లో లభ్యమవుతోంది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ వంగడం దేశ, విదేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. బహుళ ఆదరణ పొందుతున్న బియ్యం గిరాకీ దృష్ట్యా గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఈ-కామర్స్, ప్రముఖ మాల్స్‌, కిరాణ దుకాణాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జీకాట్‌ మద్దతుతో డెక్కన్‌ ముద్రా సంస్థ బియ్యాన్ని తమదైన శైలిలో మార్కెటింగ్‌ చేస్తోంది.

TELANGANA SONA RICE
TELANGANA SONA RICE

By

Published : Sep 10, 2021, 4:28 AM IST

మారుతున్న జీవన శైలితో వినియోగదారులకు చిరుధాన్యాలతో సమానమైన బియ్యం అన్నం ప్రాధాన్యత పెరిగింది. మధుమేహం(diabetes) అదుపులో ఉంచగలిగే తెలంగాణ సోనా రకం బియ్యానికి మార్కెట్‌లో ఇపుడిపుడే ఆదరణ లభిస్తోంది. 2015లో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన తెలంగాణ సోనా వరి రకం వండగం పోషక విలువలతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ మోతాదు ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. హైదరాబాద్ ఆధారిత అంకుర సంస్థ డెక్కన్ ముద్రా అగ్రి ప్రైవేటు లిమిటెడ్‌ చాలాచోట్ల తెలంగాణ సోనా రకం అందుబాటులోకి వచ్చింది.

రైతులతో సాగు చేయించి.. అధిక ధరలకు కొనుగోలు చేసి..

గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్, జీకాట్‌ సహకారంతో డెక్కన్ ముద్రా స్టాటప్‌ రైతుల నుంచి ధాన్యం సేకరించి బియ్యంగా మార్చేసి వినియోగదారులకు చేరవేస్తోంది. సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్‌, లక్ష్మీదేవిపల్లి, ఎనబావి, దుబ్బాకలో 400 మంది రైతులతో సాగు చేయించి వారి నుంచి అధిక ధరలకు కొనుగోలు చేసి మార్కెటింగ్ చేస్తున్న యువకుల కృషిని మంత్రి కేటీఆర్(KTR) అభినందించారు.

కిలో రూ.150..!

కోవిడ్ దృష్ట్యా పోషకాలున్న ఆహారం తీసుకునేందుకు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ సోనా బియ్యం వాడకం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో శాస్త్రీయంగా నిరూపితమైంది. డెక్కన్ ముద్రా సంస్థ ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సహకారంతో బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, మాములు బియ్యం కంటే ధర ఎక్కువగా ఉండటం వల్ల జనబాహుళ్యంలోకి వెళ్లడం లేదు. కిలో బియ్యం ధర సుమారు 150 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. డోర్‌డెలీవరీ సైతం చేస్తున్నట్లు డెక్కన్ ముద్రా, జికాట్ సంస్థలు తెలిపాయి.

మార్కెట్లోకి తెలంగాణ సోనా రకం బియ్యం.. దశలవారీగా రాష్ట్రమంతా విస్తరణ

ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు

మరికొన్ని జిల్లాల్లో రైతులతో సాగు చేయించి తెలంగాణ సోనాను విరివిగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకం బియ్యం చాలా మందికి బాగా నచ్చిందని, భవిష్యత్తులో మరిన్ని అంకుర సంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నామని అగ్రి ఇన్నోవేషన్ హబ్ స్పష్టం చేసింది. తెలంగాణ సోనా బియ్యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వపరంగా మరింత ప్రోత్సాహం కావాలని వ్యవసాయ వర్శిటీతో పాటు అగ్రి హబ్‌ కోరుతోంది.

ఇవీ చూడండి: KRMB: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

ABOUT THE AUTHOR

...view details