Online Harassment : బహిరంగ ప్రదేశాల్లో అతివలను వేధిస్తున్న ఆకతాయిలపై ‘షి’ టీమ్స్ అస్త్రం ప్రయోగించిన తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఇప్పుడు ఆన్‌లైన్ గస్తీని ముమ్మరం చేసింది. అంతర్జాలం వేదికగా, సామాజిక మాధ్యమాల ద్వారా టీజింగ్‌కు పాల్పడుతున్న వారి భరతం పడుతోంది. సాధారణ గస్తీ మాదిరిగానే రకరకాల ఆన్‌లైన్ టూల్స్ ద్వారా అతివలను వేధిస్తున్న వారిపై మహిళా భద్రతా విభాగం కన్నేసింది.
ఆన్‌లైన్ వేధింపులకు చెక్.. షీటీమ్స్ గట్టి సైబర్ బస్తీ - she teams focus on online harassment
Online Harassment : బహిరంగ ప్రదేశాల్లో కంటే ఆన్‌లైన్‌లో అమ్మాయిలపై ఆకతాయిల వేధింపులు ఎక్కువ. ఓ వైపు వేధింపులు.. మరోవైపు సైబర్ నేరాలతో అమాయక యువతులు మోసపోతున్నారు. ఈ అంశంపై దృష్టి సారించింది తెలంగాణ మహిళా భద్రతా విభాగం షీ టీమ్స్. ఆన్‌లైన్ వేదికగా.. సామాజిక మాధ్యమాల ద్వారా ఆడవాళ్లని వేధిస్తున్న ఆకతాయిల భరతం పడుతోంది.
She Teams in Telangana : ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆకతాయిలకు కొదవలేదు. ముఖ్యంగా ఒకే వ్యక్తి అనేక ఐడీలు తెరిచి వేరువేరు పేర్లు, ఫొటోలతో యువతులకు వలవేస్తుండటం మామూలు విషయంగా మారింది. అందుకే ఇలాంటి నకిలీవ్యక్తులను కనిపెట్టేందుకు ఆన్‌లైన్‌పై మహిళా భద్రతా విభాగం నిఘా పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఏదైనా అనుమానిత పేరు కాని, పోస్టుకాని కనిపించినా దానికి సంబంధించి ఐపీ చిరునామాపై నిఘా పెడతారు. దాని ద్వారా ఎంతమందికి ఫ్రెండ్ రిక్వెస్టు పంపారు, వారిలో ఎంతమందితో స్నేహం చేస్తున్నారు వంటి వివరాలన్నీ రాబడతారు. సామాజిక మాధ్యమాలు అన్నింటిపైనా నిఘా ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని సాఫ్ట్‌వేర్లు అభివృద్ధి చేశామని, గతంలో మాదిరిగా మహిళలను మారుపేర్లతో బురిడీ కొట్టించాలనుకున్నా, అసభ్య పదజాలంతో ఇబ్బందిపెట్టాలని చూసినా దొరికిపోవడం ఖాయమని ఓ అధికారి వెల్లడించారు.