తెలంగాణ

telangana

ETV Bharat / city

'అప్పుడు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఎలా విచారించాలి'

సచివాలయం కూల్చివేతపై 2016లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఎలా విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రశ్నించింది. వ్యాజ్యం 2016లో దాఖలు చేసినప్పటికీ... సచివాలయం కూల్చివేతను ఆపాలనే అందులో కోరామని జీవన్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. అన్ని వ్యాజ్యాలన్నీ కలిపి.. తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించిన హైకోర్టు... తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.

jeevan reddy

By

Published : Oct 21, 2019, 9:05 PM IST

సచివాలయం కూల్చివేతపై 2016లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఎలా విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రశ్నించింది. కేబినెట్ నిర్ణయం తీసుకోక ముందే... పత్రికల్లో కథనాల ఆధారంగా వ్యాజ్యం దాఖలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రిమండలి ఈ ఏడాది జూన్ 8న నిర్ణయం తీసుకున్న తర్వాత... దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరుపుతామని... అవసరమైతే తాజాగా పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. అయితే వ్యాజ్యం 2016లో దాఖలు చేసినప్పటికీ... సచివాలయం కూల్చివేతను ఆపాలనే అందులో కోరామని.. కాబట్టి తమ వాదనలు కూడా వినాలని జీవన్ రెడ్డి తరఫు న్యాయవాది సత్యం రెడ్డి వాదించారు. సచివాలయం కూల్చివేతపై దాఖలైన వ్యాజ్యాలన్నీ కలిపి.. తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించిన హైకోర్టు... తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details