TSRTC MD Sajjanar : తెలంగాణ ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ అంశంపై ఆ సంస్థ ఎండీ సజ్జనార్ స్పందించారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ఎవర్నీ బలవంతం చేయడం లేదని స్పష్టం చేశారు. 2వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఉద్యోగుల వీఆర్‌ఎస్ సంఖ్యను బట్టి ప్యాకేజీ సిద్ధం చేస్తామని వెల్లడించారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలు తర్వాత ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు.
TSRTC MD Sajjanar : 'వీఆర్‌ఎస్ కోసం ఎవరినీ బలవంతం చేయట్లేదు' - వీఆర్‌ఎస్‌పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్
TSRTC MD Sajjanar : ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ఉద్యోగులను ఎవరినీ బలవంతం చేయడం లేదని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. వీఆర్ఎస్‌కు 2 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. ఉద్యోగుల వీఆర్‌ఎస్ సంఖ్యను బట్టి ప్యాకేజీ సిద్ధం చేస్తామని సజ్జనార్ వెల్లడించారు.
TSRTC MD Sajjanar
Sajjanar About VRS : యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని సజ్జనార్ తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్‌కు బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉప్పల్ సర్కిల్ నుంచి యాదగిరిగుట్టకు మినీ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. జేబీఎస్ నుంచి రూ.100, ఉప్పల్ నుంచి రూ.75 టికెట్ ధర నిర్ణయించినట్లు వివరించారు.