తెలంగాణ

telangana

ETV Bharat / city

TSRTC chairman Bajireddy Govardhan : 'మా కాంబినేషన్​లో ఆర్టీసీ ప్రగతిపథంలో దూసుకెళ్తుంది' - తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్

ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిని(RTC tarnaka hospital) మార్చిలోగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి(super speciality hospital)గా మారుస్తామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్(TSRTC chairman Bajireddy Govardhan), ఎండీ సజ్జనార్(TSRTC MD Sajjanar) అన్నారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. తమ కాంబినేషన్​లో ఆర్టీసీ ప్రగతి పథంలో దూసుకెళ్తుందని అన్నారు. మరోవైపు... ప్రజల సహకారంతో ఆర్టీసీ ఆదాయం రికార్డు స్థాయికి పెరిగిందని చెప్పారు. ప్రజలంతా ఆర్టీసీని ఆదరించి.. అండగా నిలవాలని కోరారు.

TSRTC chairman Bajireddy Govardhan
TSRTC chairman Bajireddy Govardhan

By

Published : Nov 1, 2021, 12:39 PM IST

మా కాంబినేషన్​లో టీఎస్​ఆర్టీసీ ప్రగతిపథంలో దూసుకెళ్తుంది

ఆర్టీసీకి మంచి శకం వచ్చిందని టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్(TSRTC chairman bajireddy govardhan) తెలిపారు. ఎక్కడ అమ్మేస్తారో.. ప్రైవేట్‌పరం చేస్తారేమోనని అందరు అనుకున్నారని అన్నారు. ఆర్టీసీపై ప్రజలకు నమ్మకం కలిగిందని.. అందుకే ఇప్పుడు ఎక్కువ శాతం ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. ప్రయాణికులు ఆర్టీసికి అండగా నిలిచి.. ఆదరించాలని కోరారు.

హైదరాబాద్​ ఆర్టీసీ తార్నాక ఆస్పత్రి(ICU in Tarnaka hospital)లో ఐసీయూను ఆర్టీసీ ఎండీ సజ్జనార్(TSRTC MD Sajjanar), డీహెచ్ శ్రీనివాస్​తో కలిసి ప్రారంభించారు. ఈ ఐసీయూలో 20 పడకలు ఉన్నాయి.

"ఆర్టీసీ ఎక్కడ ప్రైవేటుపరం అవుతుందోనని అటు ప్రజలు.. ఇటు సిబ్బంది చాలా ఆందోళనకు గురయ్యారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఛైర్మన్​గా నన్ను.. ఎండీగా సజ్జనార్​ను నియమించి.. ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపించే బాధ్యతను అప్పగించారు. మా ఇద్దరిది మంచి కాంబినేషన్. మేం ఒకరి నిర్ణయాలను మరొకరం గౌరవిస్తూ.. ఆర్టీసీ ప్రగతికి ఏది ముఖ్యమో దాన్ని అమలు చేసేలా కృషి చేస్తున్నాం. దాని ఫలితమే రెండు నెలల్లో ఆర్టీసీ రికార్డు స్థాయి ఆదాయం గడించడం. భవిష్యత్​లోనూ ఇదే పునరావృతమవుతుంది. ఆర్టీసీ కష్టాలనుంచి గట్టెక్కడమే కాదు.. తెలంగాణ రథచక్రాలు ప్రగతిపథంలో మున్ముందుకు దూసుకెళ్తాయి. తెలంగాణ ఆర్టీసీకి ఆర్థిక పరిపుష్టత కలుగుతుంది."

- బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్

తార్నాక ఆస్పత్రి(RTC tarnaka hospital)ని సూపర్ స్పెషాలిటీ(Super speciality hospital) ఆస్పత్రిగా మారుస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్(TSRTC MD Sajjanar) తెలిపారు. మార్చిలోగా ఆ పనులు పూర్తవుతాయని చెప్పారు. ఆర్టీసీ ఆదాయం రికార్డుస్థాయికి పెరిగిందన్న సజ్జనార్.. సమష్టిగా కృషిచేసి మరింత ఆదాయాన్ని పెంచుతామని అన్నారు.

"నేను ఆర్టీసీ ఎండీగా బాధ్యత తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ డ్రైవ్​కు వచ్చినప్పుడు ఈ ఆస్పత్రిని చూశాం. దీన్ని సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని అప్పుడే నిర్ణయానికి వచ్చాం. దానికి సంబంధించి ఓ ప్రణాళిక రూపొందించాం. ఆ ప్రణాళికాబద్ధంగా డయాలసిస్, ఫిజియోథెరపీ, 24x7 మెడిసిన్ యూనిట్​లను మొదలుపెట్టాం. ఇవాళ ఐసీయూ, ఎమర్జెన్సీ యూనిట్​లను ప్రారంభించాం. రానున్న రోజుల్లో డయాగ్నస్టిక్ సెంటర్.. ఇంకా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉండాల్సిన అన్ని వసతులు కల్పిస్తాం. మార్చిలోగా తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​గా మారుస్తాం. దీనికి సహకరిస్తోన్న ప్రభుత్వం, అధికారులకు ధన్యవాదాలు."

- సజ్జనార్, ఆర్టీసీ ఎండీ

టీఎస్​ఆర్టీసీ(Telangana RTC) చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు అభినందిస్తున్నారని సజ్జనార్(TSRTC MD Sajjanar) తెలిపారు. ఆదాయపెంపులో ప్రజల భాగస్వామ్యం ఉందని అన్నారు. ఇలాగే ప్రజలు ఆర్టీసీని ఆదరిస్తూ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. కార్గో, పార్శిల్ సేవలను కూడా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details