తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆర్టీసీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఆదుకోవాలి' - telangana rtc is in loss due to corona pandemic

కరోనా వైరస్ వ్యాప్తి వల్ల నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కోరింది. లాక్​డౌన్​ నిబంధనలు సడలించినా... ఆర్టీసీ తేరుకోలేకపోతోందని యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి తెలిపారు.

telangana rtc requests state and central government to support
తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్

By

Published : Jul 20, 2020, 7:17 PM IST

లాక్​డౌన్​ నిబంధనలు సడలించినా... కరోనా భయంతో ప్రజలు సొంత వాహనాల్లో ప్రయాణించేందుకే మొగ్గుచూపుతున్నారని, అందువల్ల ఆర్టీసీ ఆదాయం పడిపోయిందని తెలంగాణ ఆర్టీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అన్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బస్సులు నడవడం లేదని, వచ్చిన డబ్బులు డీజిల్ ఖర్చులకే సరిపోవడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల్లో రవాణా రంగానికి కేటాయింపులు చేయలేదని పేర్కొన్నారు.

మార్చి 22వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులు నడవనందున ఆదాయం పూర్తిగా పడిపోయిందని రాజిరెడ్డి తెలిపారు. లాక్​డౌన్​ విధించిన మూణ్నెళ్లు వేల మందికి 50 శాతం జీతం మాత్రమే చెల్లించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోలేదని, ఆర్టీసీకి ఇవ్వాల్సిన రియంబర్స్​మెంట్​ డబ్బు, ఆర్థిక ప్యాకేజీని వెంటనే ప్రకటించాలని కోరారు. ఈ నెల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details