తెలంగాణ

telangana

ETV Bharat / city

రైట్ రైట్... మీరెన్ని నడిపితే మేమన్ని..! - telangana to run inter state bus services

కరోనా వైరస్ వ్యాప్తితో నిలిచిపోయిన అంతర్​ రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. తొలుత ఏపీతో ఒప్పందం చేసుకునే దిశగా కార్యచరణ ప్రారంభించింది.

Telangana RTC has decided to restore interstate services.with Andhra pradesh
మీరెన్ని నడిపితే మేమన్ని..!

By

Published : Jun 12, 2020, 6:28 AM IST

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్టీసీల మధ్య సమాన సంఖ్యలో బస్సులు, కిలోమీటర్ల మేర నడిపే విధానంలో ఒప్పందం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం ఏపీతో ఇప్పటి వరకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం జరగలేదు. ఉమ్మడి రాష్ట్ర హయాంలో సరిహద్దు రాష్ట్రాలతో ఉన్న ఒప్పందమే అమలులో ఉంది.

కరోనా తీవ్రతతో నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలతో ఒప్పందం చేసుకున్న తరవాతే అంతర్రాష్ట్ర సర్వీసులను ప్రారంభించాల్సిందిగా సీఎం కేసీఆర్‌ అధికారులకు స్పష్టం చేశారు. విధివిధానాలను రూపొందించే పనిలో టీఎస్‌ఆర్టీసీ అధికారులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details