రాష్ట్రంలో కొత్తగా 753 కరోనా కేసులు, 3 మరణాలు
08:45 November 28
రాష్ట్రంలో కొత్తగా 753 కరోనా కేసులు, 3 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 753 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,68,418కి పెరిగింది. తాజాగా 952 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకూ 2,56,330 మంది ఆరోగ్యవంతులుగా కోలుకున్నారు. మరో ముగ్గురు మృతి చెందారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,451కి చేరుకుంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 133 కేసులు నమోదవగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 78, రంగారెడ్డిలో 71 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి :ప్రతిపక్షాలవి వేర్పాటువాద రాజకీయాలు: కేటీఆర్