తెలంగాణ

telangana

By

Published : Jan 21, 2022, 7:13 PM IST

Updated : Jan 21, 2022, 7:34 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 4,416 కరోనా కేసులు, 2 మరణాలు

Corona
Corona

19:12 January 21

రాష్ట్రంలో కొత్తగా 4,416 కరోనా కేసులు, 2 మరణాలు

Telangana Corona: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇవాళ ఒకేరోజు నాలుగు వేలకు పైగా మంది కొవిడ్ బారిన పడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా 4,416 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీనితో ఇప్పటి వరకు 7,26,819 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఈరోజు 1,920 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కొవిడ్ నుంచి 6,93,623 మంది రికవరీ అయ్యారు. తాజాగా మరో ఇద్దరు మృతి చెందగా.. కొవిడ్ మరణాలు 4069కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 29,127 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 1670 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా..

తాజాగా నమోదైన కేసుల్లో ఆదిలాబాద్ 25, కొత్తగూడెం 88, జగిత్యాల 65, జనగామ 41, జయశంకర్ భూపాలపల్లి 36, జోగులాంబ గద్వాల 50, కామారెడ్డి 40, కరీంనగర్ 91, ఖమ్మం 117, కుమురంభీం ఆసిఫాబాద్ 32, మహబూబ్ నగర్ 99, మహబూబాబాద్ 70, మంచిర్యాల 92, మెదక్ 52, మేడ్చల్ మల్కాజిగిరి 417, ములుగు 27, నాగర్​కర్నూల్ 72, నల్గొండ 90, నారాయణపేట 36, నిర్మల్ 36, నిజామాబాద్ 75, పెద్దపల్లి 73, రాజన్న సిరిసిల్ల 44, రంగారెడ్డి 301, సంగారెడ్డి 99, సిద్దిపేట 73, సూర్యాపేట 59, వికారాబాద్ 63, వనపర్తి 46, వరంగల్ 70, హనుమకొండ 178, యాదాద్రి భువనగిరి 89 చొప్పున కొవిడ్ కేసులు వెలుగు చూశాయి.

ప్రారంభమైన ఫీవర్​ సర్వే

కొవిడ్‌కట్టడికి ప్రభుత్వం చేపట్టిన ఫీవర్‌సర్వే రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. తొలిరోజు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి వెంటనే మెడికల్‌ కిట్‌ అందించారు. ఫీవర్‌ సర్వేను పలు చోట్ల సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, కలెక్టర్లు పర్యవేక్షించారు. వారంలో జ్వర సర్వే పూర్తిచేసేలా చర్యలు చేపట్టారు. కొవిడ్-19 థర్డ్​ వేవ్​, ఒమిక్రాన్​ ఆందోళన పడాల్సిన అవసరంలేదని సీఎస్ అన్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తిని పరిశీలిస్తే క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే కోటికి పైగా మెడికల్ కిట్​లను సిద్ధంగా ఉంచామని, రోజుకు లక్ష పరీక్షలు చేస్తున్నామని వివరించారు. వారం రోజుల్లోగా పూర్తి చేసే ఈ ఇంటింటి ఫీవర్ సర్వేకు వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన సభ్యులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

ఇదీ చదవండి :'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 21, 2022, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details