Telangana Corona Cases: రాష్ట్రంలో ఇవాళ 84,280 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,707 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,02,801కు చేరింది. కరోనా బారినపడి మరో ఇద్దరు మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 4,049కు చేరింది. కొవిడ్ నుంచి మరో 582 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 6,78,290 మంది బాధితులు కోలుకున్నారు. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలోనే 1,328 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 20,462 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Telangana Corona Cases: రాష్ట్రంలో 2707 మందికి కొవిడ్ పాజిటివ్ - telangana covid cases
19:24 January 13
రాష్ట్రంలో ఇవాళ 2707 మందికి కొవిడ్ పాజిటివ్
దేశంలో అమాంతం పెరిగిన కేసులు..
Corona cases in India: భారత్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే.. 2,47,417 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ధాటికి మరో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. 84,825 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:3,63,17,927
- మొత్తం మరణాలు:4,85,035
- యాక్టివ్ కేసులు:11,17,531
- మొత్తం కోలుకున్నవారు:34,715,361
ఇదీచూడండి:ASK KTR: లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ ఉంటుందా?.. మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..