రాష్ట్రంలో 8 వేలు దాటిన కరోనా క్రియాశీల కేసులు - telangana covid cases updates

09:11 April 05
రాష్ట్రంలో మరో 1,097 కరోనా కేసులు, 6 మరణాలు
కరోనా రెండో దశ తెలంగాణను చుట్టుముట్టేస్తోంది. మొదటి దశ కన్నా వేగంగా విస్తరిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో మరో 1,097 మంది కొవిడ్ బారిన పడగా.. వైరస్ సోకి ఆరుగురు మృతి చెందారు.
ప్రస్తుతం 8,746 కరోనా క్రియాశీలక కేసులు ఉన్నాయి. 4,458 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 302 మంది కొవిడ్ బారినపడ్డారు. రాష్ట్రంలో ఆదివారం రోజు 43,070 మంది కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు.
ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచిస్తున్నా.. చాలా వరకు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇలానే కొనసాగితే.. సెకండ్ వేవ్ కరోనాను తెలంగాణ అధిగమించడం కష్టంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
- ఇదీ చదవండి :కొవిడ్ లక్షణాలు మూడు రకాలు