TS Corona Cases: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత వారం మూడువేలకుపైగా నమోదైన కేసులు ప్రస్తుతం తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,892 కొవిడ్ టెస్టులు చేయగా.. 1,061 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,79,971కు చేరింది. వైరస్ బారినపడి మరొకరు మృతిచెందగా.. మొత్తం మృతిచెందినవారి సంఖ్య 4,102కు చేరింది.
TS Corona Cases: కరోనా తగ్గుముఖం.. 1,061 కేసులు నమోదు - తెలంగాణలో కొవిడ్ కేసులు
TS Corona Cases: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,892 కొవిడ్ టెస్టులు చేయగా.. 1,061 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మరొకరు మరణించారు.
TS Corona Cases
కరోనా నుంచి మరో 3,590 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,470 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మరో 2,018 పరీక్షలు ఫలితాలు రావాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 274 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీచూడండి:DH on Corona Third Wave: 'కరోనా మూడో దశ పూర్తిగా తగ్గింది.. ఎలాంటి ఆంక్షల్లేవు'