corona cases: రాష్ట్రంలో కొత్తగా 417 కేసులు, 2 మరణాలు నమోదు - corona deaths in telangana

19:10 August 17
రాష్ట్రంలో కొత్తగా 417 కేసులు, 2 మరణాలు నమోదు
రాష్ట్రంలో ఇవాళ 87,230 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 417 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 6,53,202కు చేరింది. మహమ్మారి బారినపడి మరో ఇద్దరు తుదిశ్వాస విడిచారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,847కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
కరోనా నుంచి మరో 569 మంది బాధితులు తాజాగా కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 6,939 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీచూడండి:'టీకా రెండు డోసులే... మళ్లీమళ్లీ కుదరదు'