రాష్ట్రంలో కొత్తగా 340 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,57,716 మంది కరోనా బారిన పడ్డారు. 359 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,47,953 మందికి చేరింది. తాజాగా కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు 3,872 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,891 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
పెరిగిన పాజిటివిటీ రేటు
గడిచిన 24 గంటల్లో 75,102 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇంకా 1,658 మంది రిపోర్ట్స్ రావల్సి ఉంది. ఇప్పటివరకు 2,45,59,439 మందికి నిర్ధరణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.58 శాతం, రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది. 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 24 జిల్లాలో పదిలోపే కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్లో 72 మందికి వైరస్ సోకింది.