తెలంగాణ

telangana

ETV Bharat / city

'కోటి వృక్షార్చనలో పాల్గొని.. సీఎంకు హరిత కానుక ఇస్తాం' - telangana latest news

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో రేషన్​ డీలర్లంతా కుటుంబసభ్యులతో సహా పాల్గొంటామని... ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పూజలు, ప్రత్యేక ప్రార్థనలు చేపడతామన్నారు.

telangana ration dealers association will participate in koti vruksharchana
'కోటి వృక్షార్చనలో పాల్గొని.. సీఎంకు హరిత కానుక ఇస్తాం'

By

Published : Feb 15, 2021, 8:42 PM IST

ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని తలపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో తామూ భాగస్వాములవుతామని రేషన్​ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు అన్నారు. హైదరాబాద్‌ ఎర్రమంజిల్​లో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు. పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చనపై చర్చించారు.

మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు తాము అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు దేవాలయాల్లో కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు, అన్నదానాలు, మసీదులు, చర్చీల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఒకే రోజు ఒక గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో తమతోపాటు కుటుంబ సభ్యులంతా పాల్గొని సీఎంకు హరిత కానుక అందిస్తామన్నారు.

'కోటి వృక్షార్చనలో పాల్గొని.. సీఎంకు హరిత కానుక ఇస్తాం'

ఇదీ చూడండి:భూమి ఉన్నంత వరకు కేసీఆర్​ సంక్షేమ ఫలాలు అందుతాయి: కవిత

ABOUT THE AUTHOR

...view details