తెలంగాణ

telangana

ETV Bharat / city

మాకు ఆరోగ్య రక్షణ కల్పించాలి : రేషన్ డీలర్లు - telangana ration dealers association

దిల్లీ, గుజరాత్, పశ్చిమ బంగ రాష్ట్రాల్లో లాగే తెలంగాణలో కరోనాతో మృతి చెందిన రేషన్ డీలర్లకు రూ.25 లక్షల పరిహారం అందజేయాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. తమకు ఆరోగ్య రక్షణ కల్పిస్తేనే సరకులు పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది.

ration dealers, ration dealers in telangana
రేషన్ డీలర్లు, తెలంగాణ రేషన్ డీలర్లు

By

Published : Apr 22, 2021, 2:49 PM IST

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నందున తమకు ఆరోగ్య రక్షణ కల్పిస్తేనే సరకులు పంపిణీ చేస్తామని రేషన్ డీలర్ల సంఘం స్పష్టం చేసింది. కరోనా బారినపడి మృతి చెందిన రేషన్ డీలర్లకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈనెల 30 వరకు ఈ సమస్యపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేనియెడల భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని అన్నారు.

దిల్లీ, గుజరాత్, పశ్చిమ బంగ, ఛండీగఢ్ రాష్ట్రాల్లో కరోనాతో మృతి చెందిన రేషన్ డీలర్లు రూ.25 లక్షలు పరిహారం ఇస్తున్నారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు తెలిపారు. తమకు బకాయిపడిన రూ.57 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్లుకు ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు సరఫరా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details