కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయానికి సంబంధించి తీసుకొచ్చిన ఆర్టినెన్స్లను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం... వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి లేఖ రాసింది. రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులందిరికీ ఒకే దఫా అప్పులన్నింటినీ రద్దు చేయాలని విన్నవించింది. రాష్ట్రంలో రైతుల భూరికార్డుల వివాదాలన్నింటిని వెంటనే పరిష్కరించి, రైతులు, కౌలు రైతులందరికీ రైతుబంధు పథకం వర్తింపజేయాలని కోరింది.
మంత్రి నిరంజన్‌రెడ్డికి తెలంగాణ రైతు సంఘం లేఖ - minister singireddy niranjan reddy
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలంగాణ రైతు సంఘం లేఖ రాసింది. కేంద్ర సర్కారు ఇటీవల వ్యవసాయానికి సంబంధించి తీసుకొచ్చిన ఆర్డినెన్సులను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్ చేసింది.
మంత్రి నిరంజన్‌రెడ్డికి తెలంగాణ రైతు సంఘం లేఖ
వీటితో పాటు బీమా పథకం రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలందరికీ వర్తింపు, కౌలు రైతులకు కౌలు కార్డులు ఇచ్చి, పంట రుణాలు ఇవ్వటం...ఆత్మ హత్య చేసుకున్న రైతు, కౌలు రైతు, వ్యవసాయ కూలీ, చేతివృత్తుల కుటుంబాలన్నింటికీ పరిహారం, ప్యాకెజీ ఇవ్వటం తదితర డిమాండ్‌లను ప్రభుత్వం ముందించింది.
ఇవీ చూడండి: తల్లి పాలు శిశువులకు ఎంతో ఆరోగ్యకరం: గవర్నర్ తమిళిసై