తెలంగాణ

telangana

ETV Bharat / city

LIVE UPDATES: ప్రమాదకరస్థాయికి గోదావరి.. 63.50 అడుగుల వద్ద నీటిమట్టం - తెలంగాణ వర్షాలు

telangana rains
telangana rains

By

Published : Jul 14, 2022, 6:36 AM IST

Updated : Jul 14, 2022, 10:41 PM IST

22:39 July 14

  • భద్రాచలంలో వేగంగా పెరుతున్న గోదావరి నీటిమట్టం
  • ఈరోజు రాత్రి 10 గంటలకు 63.50 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటిమట్టం
  • వరద నీటి ప్రవాహం 19,74,762 క్యూసెక్కులు

21:47 July 14

  • భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • రాత్రి 9 గం.కు 63.20 అడుగుల వద్ద నీటిమట్టం
  • వరద నీటి ప్రవాహం 19,90,294 క్యూసెక్కులు

21:47 July 14

  • నిర్మల్: కడెం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖా నాయక్
  • కుటుంబ సమేతంగా గంగమ్మ తల్లికి పూజలు చేసి,హారతి ఇచ్చిన మంత్రి

20:33 July 14

  • భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • రాత్రి 8 గం.కు 62.80 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటిమట్టం
  • వరద నీటి ప్రవాహం 20.38 లక్షల క్యూసెక్కులు

20:23 July 14

వర్షాలు, వరదలపై హరీశ్‌రావు సమీక్ష..

సిద్దిపేట: జిల్లాలో చెరువులు నిండిపోయాయి: మంత్రి హరీశ్‌రావు

వర్షాలు, వరదలపై కలెక్టరేట్‌లో మంత్రి హరీశ్‌రావు సమీక్ష

జిల్లాలోని 181 చెరువులు నిండాయి: మంత్రి హరీశ్‌రావు

జిల్లాలోని 131 చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి: మంత్రి హరీశ్‌రావు

జిల్లా వ్యాప్తంగా 534 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి: మంత్రి హరీశ్‌రావు

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి ఆదేశం

19:59 July 14

లోతట్టు ప్రజలు, శిథిలావస్థ ఇళ్లలో ఉన్నవారిని శిబిరాలకు తరలించాలి: మంత్రి

  • ఏజెన్సీ ప్రాంతాల కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులతో మంత్రి సత్యవతి సమీక్ష
  • వరద ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలి: మంత్రి సత్యవతి
  • గిరిజన గురుకులాల్లో సమస్యలు లేకుండా చూడాలి: మంత్రి సత్యవతి
  • విద్యుత్, తాగునీటి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: మంత్రి
  • సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సత్యవతి
  • అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి: మంత్రి సత్యవతి
  • లోతట్టు ప్రజలు, శిథిలావస్థ ఇళ్లలో ఉన్నవారిని శిబిరాలకు తరలించాలి: మంత్రి
  • అంగన్వాడీల పౌష్టికాహారాన్ని టేక్ హోమ్ రేషన్ ద్వారా కొనసాగించాలి: మంత్రి

19:57 July 14

నిజాంసాగర్ ప్రాజెక్టుకు 25,350 క్యూసెక్కుల ప్రవాహం

  • కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పెరిగిన వరద ప్రవాహం
  • నిజాంసాగర్ ప్రాజెక్టుకు 25,350 క్యూసెక్కుల ప్రవాహం
  • ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1398.88 అడుగులు
  • ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1405 అడుగులు
  • నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
  • ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తిన అధికారులు
  • ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,35,510 క్యూసెక్కులు
  • ప్రాజెక్టు ఔట్ ఫ్లో 2,05,880 క్యూసెక్కులు
  • ప్రస్తుత నీటి మట్టం 1087.3అడుగులు, పూర్తి నీటి మట్టం 1091 అడుగులు

18:56 July 14

గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది: మంత్రి పువ్వాడ

  • గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది: మంత్రి పువ్వాడ
  • అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి: మంత్రి పువ్వాడ
  • యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలి: మంత్రి పువ్వాడ

18:55 July 14

  • కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పెరిగిన వరద ప్రవాహం
  • నిజాంసాగర్ ప్రాజెక్టుకు 25,350 క్యూసెక్కుల ప్రవాహం
  • ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1398.88 అడుగులు
  • ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1405 అడుగులు
  • నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
  • ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తిన అధికారులు
  • ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,35,510 క్యూసెక్కులు
  • ప్రాజెక్టు ఔట్ ఫ్లో 2,05,880 క్యూసెక్కులు
  • ప్రస్తుత నీటి మట్టం 1087.3అడుగులు, పూర్తి నీటి మట్టం 1091 అడుగులు

18:55 July 14

  • పెద్దపల్లి: రెండ్రోజులుగా వరదలోనే మంథని వ్యవసాయ మార్కెట్
  • వర్షాలు, వరదల కారణంగా నీటిలో మునిగిపోయిన నిల్వలు
  • నీటిలో మునిగిపోయిన సుమారు 2,600 క్వింటాళ్ల ధాన్యం

18:55 July 14

  • హైదరాబాద్‌: నిన్న హుస్సేన్ సాగర్‌లో తప్పిన ప్రమాదం
  • సాంకేతిక కారణాలతో నీటి మధ్యలో ఆగిన బోటు
  • బుద్ధుని విగ్రహం నుంచి వెనక్కి వస్తుండగా ఆగిన బోటు
  • స్టీమర్ బోట్లతో పెద్ద బోటును ఒడ్డుకు చేర్చిన టూరిజం సిబ్బంది
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

18:55 July 14

భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

సాయంత్రం 6 గం.కు 62.20 అడుగుల వద్ద నీటిమట్టం

వరద నీటి ప్రవాహం 19.29 క్యూసెక్కులు

17:33 July 14

భద్రాచలంలో రేపటికల్లా నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం

  • భద్రాచలంలో రేపటికల్లా నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం
  • మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక
  • లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు శిబిరాలకు తరలించాలి: సీఎస్‌
  • జనరేటర్లు, ఇసుకసంచులు అందుబాటులో ఉంచుకోవాలని సీఎస్‌ సూచన
  • అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచన
  • అప్రమత్తంగా ఉండి ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి: సీఎస్‌

17:33 July 14

భద్రాచలంలో హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమీక్ష

  • జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్
  • భద్రాచలంలో హెచ్చరికల నేపథ్యంలో సమీక్ష

17:07 July 14

అక్కడ రాకపోకలు బంద్.. 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఆంక్షలు

  • భద్రాచలంలో గోదావరి వారధిపై రాకపోకలు నిలిపివేత
  • ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో అతలాకుతలమైన భద్రాచలం
  • వంతెన చరిత్రలో రెండోసారి రాకపోకలు నిలిపి వేయాల్సిన పరిస్థితి
  • 1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరడంతో రాకపోకలు నిలిపివేత
  • 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఆంక్షలు విధిస్తూ రాకపోకలు నిలిపివేత
  • సాయంత్రం 5 నుంచి 48 గంటల పాటు వారధిపై రాకపోకలు బంద్‌
  • రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కలెక్టర్
  • ఛత్తీస్‌గఢ్, ‌ఒడిశా, ఏపీకి పూర్తిగా నిలిచిన రాకపోకలు
  • భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్య 144 సెక్షన్ విధింపు

16:45 July 14

భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి వరద

  • పెద్దపల్లి: మంథని మం. కాశీపేటలో నీటమునిగిన సరస్వతీ పంప్ హౌస్
  • భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి వరద
  • సాయంత్రం 4 గం.కు 61.50 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటిమట్టం
  • గోదావరి నదిలో ప్రస్తుతం 18.85 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

16:24 July 14

భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి

మధ్యాహ్నం 3 గం.కు 61.30 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటిమట్టం

వరద నీటి ప్రవాహం 18.70లక్షల క్యూసెక్కులు

16:24 July 14

నిర్మల్: కడెం జలాశయంలోకి కొనసాగుతున్న వరద

జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు

జలాశయం ప్రస్తుత నీటిమట్టం 686 అడుగులు

జలాశయంలోకి చేరుతున్న 1,81,466 క్యూసెక్కులు

జలాశయం 17 గేట్ల ద్వారా 1,81,466 క్యూసెక్కులు విడుదల

స్వర్ణ జలాశయంలోకి చేరుతున్న వరద నీరు

స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు

స్వర్ణ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1180 అడుగులు

15:45 July 14

నీటమునిగిన సరస్వతీ పంప్ హౌస్

  • పెద్దపల్లి: మంథని మం. గుంజపడుగులో నీటమునిగిన సరస్వతీ పంప్ హౌస్
  • పెద్దపల్లి: వరద నీటితో మునిగిన 12 మోటార్లు

15:09 July 14

జోరు వానలతో భయాందోళనలో నాగోల్ అయ్యప్ప కాలనీ

  • హైదరాబాద్‌: జోరు వానలతో భయాందోళనలో నాగోల్ అయ్యప్ప కాలనీ
  • ముంపు భయంతో ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన స్థానికులు
  • హైదరాబాద్‌: తాళాలతో దర్శనమిస్తున్న కాలనీలోని పలు ఇళ్లు
  • వరద భయంతో కొంతమంది బయటకు రాలేక అవస్థలు
  • బండ్లగూడ చెరువు దగ్గరగా ఉండటంతో నీళ్లు ఊరుతున్నాయంటున్న స్థానికులు

15:09 July 14

  • మంచిర్యాల: నీళ్లట్యాంకుపై చిక్కుకుపోయిన రైతులను రక్షించిన అధికారులు
  • హెలికాప్టర్‌ ద్వారా రైతులను ఎన్టీపీసీకి చేర్చిన అధికారులు
  • ఒడ్డుసోమనపల్లిలో నీళ్ల ట్యాంక్‌పై చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు
  • పశువుల ఆచూకీ కోసం వెళ్లి నీళ్ల ట్యాంక్‌పై చిక్కుకుపోయిన రైతులు
  • ఎమ్మెల్యే బాల్కసుమన్‌ చొరవతో రైతులను రక్షించిన అధికారులు

15:09 July 14

  • భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయిలో పెరిగిన గోదావరి నీటిమట్టం
  • మధ్యాహ్నం 2 గంటల వరకు 60.80 అడుగులకు చేరిన నీటిమట్టం
  • భద్రాచలం: గోదావరి వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
  • గోదావరి నదిలో ప్రస్తుతం 18.46 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

15:08 July 14

  • వరద సహాయ, పునరావాస చర్యలపై సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్ష
  • సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ అధికారులతో సమీక్ష
  • రాష్ట్రంలో 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం: సీఎస్‌
  • భారీ వర్షాలు, వరదలు ఉన్నా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి: సీఎస్‌
  • వర్షాలు, వరదలతో ఎక్కడా భారీ నష్టం జరగలేదు: సీఎస్‌
  • గోదావరి నదీపరివాహక జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించాం: సీఎస్‌
  • ములుగు, భూపాలపల్లి, భద్రాచలం జిల్లాలపై అప్రమత్తంగా ఉన్నాం: సీఎస్‌
  • ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని కాపాడాం: సీఎస్‌
  • ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు 16 మందిని రక్షించాయి: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  • వైమానికదళం ఇద్దరిని రక్షించింది: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  • రాష్ట్రంలో 223 ప్రత్యేక శిబిరాల్లో 19,071 మందికి ఆశ్రయం: సీఎస్‌
  • భద్రాచలం జిల్లాలో 43 శిబిరాల్లో 6,318 మందికి ఆశ్రయం: సీఎస్‌
  • ములుగు జిల్లాలో 33 శిబిరాల్లో 4,049 మందికి ఆశ్రయం: సీఎస్‌
  • భూపాలపల్లి జిల్లాలో 20 శిబిరాల్లో 1,226 మందికి ఆశ్రయం: సీఎస్‌

15:08 July 14

  • గోదావరి వరద ఉద్ధృతితో నీటిమునిగిన కన్నెపల్లి పంప్‌హౌస్‌

13:34 July 14

  • మేడిగడ్డ బ్యారేజ్ వద్ద అంతకంతకూ పెరుగుతున్న వరద ప్రవాహం
  • కంట్రోల్ రూమ్‌, సీఆర్‌పీఎఫ్‌ కార్యాలయాన్ని చుట్టుముట్టిన వరద
  • కంట్రోల్‌రూమ్‌లోనే చిక్కుకుపోయిన ప్రాజెక్టు ఇంజినీర్లు
  • సీఆర్‌పీఎఫ్‌ కార్యాలయంలో చిక్కుకుపోయిన భద్రతా సిబ్బంది
  • ఇంజినీర్లు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని రక్షించేందుకు అధికారుల చర్యలు
  • వరద ఉద్ధృతి వల్ల సహాయక చర్యలకు ఆటంకం

13:13 July 14

నిజామాబాద్‌ : జక్రాన్‌పల్లి మండలంలో పడకల్, కేశ్‌పల్లి చెరువులకు గండి

  • నిజామాబాద్ జిల్లాలో గ్రామాలను ముంచెత్తిన వరద ప్రవాహం
  • నీట మునిగిన కేశ్ పల్లి గ్రామం
  • పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు
  • అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లలేక వ్యక్తి మృతి

13:13 July 14

మంచిర్యాల-నిర్మల్‌ మధ్య కోతకు గురైన పాండువాపూర్‌ వంతెన

  • కడెం జలాశయం దిగువన ఉన్న పాండువాపూర్‌ వంతెన
  • మంచిర్యాల-నిర్మల్‌ మధ్య రాకపోకలకు అంతరాయం

13:13 July 14

రాష్ట్రానికి రాగల మూడ్రోజులపాటు వర్ష సూచన

  • రాష్ట్రంలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం
  • రాష్ట్రంలో రేపు అక్కడకక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం
  • గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

13:12 July 14

గోదారమ్మ శాంతించాలని పెద్దపల్లిలో పూజలు

  • పెద్దపల్లి జిల్లా: మంథని వద్ద గోదావరి ఉగ్రరూపం
  • రెండ్రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న మంథని పట్టణం
  • నాలుగు రోజులుగా భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న ప్రజలు
  • గోదారమ్మ శాంతించాలని వేదపండితులు, మహిళల ప్రత్యేక పూజలు

12:42 July 14

భద్రాచలం పట్టణాన్ని చుట్టుముడుతున్న వరద

  • వరద గుప్పిట్లో చిక్కుకున్న భద్రాచలంలోని నాలుగు కాలనీలు
  • కొత్తకాలనీ, సుభాష్‌నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీలోకి చేరిన వరద
  • అయ్యప్ప కాలనీ, రామాలయం ప్రాంతంలోకి చేరిన వరద నీరు
  • ఇళ్లల్లో నుంచి బయటకు రాలేక బిక్కుబిక్కుమంటున్న బాధితులు
  • గోదావరి ఉద్ధృతి దృష్ట్యా ప్రజలు బయటకు రాకుండా అధికారుల అప్రమత్తం
  • భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 114 సెక్షన్‌ విధింపు
  • భద్రాచలం గోదావరి వంతెనపై సాయంత్రం 5 నుంచి రాకపోకలు బంద్
  • వరద ముంపు దృష్ట్యా రాకపోకలు నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ వెల్లడి
  • రెండ్రోజులపాటు వంతెనపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపిన కలెక్టర్‌
  • ప్రజలు అధికారులకు సహకరించాలని కోరిన కలెక్టర్‌ అనుదీప్‌

12:41 July 14

భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయిలో పెరిగిన గోదావరి నీటిమట్టం

  • మ.12 గంటల వరకు గోదావరిలో 60.30 అడుగులకు చేరిన నీటిమట్టం
  • భద్రాచలం: గోదావరి వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
  • గోదావరి నదిలో ప్రస్తుతం 18.16 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

12:41 July 14

కడెం నారాయణరెడ్డి జలాశయానికి తగ్గుతున్న వరద

  • కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 686.27 అడుగులు
  • కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
  • కడెం జలాశయం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,83,615 క్యూసెక్కులు

12:19 July 14

సాయంత్రం 5 నుంచి భద్రాచలం గోదావరి వంతెనపై రాకపోకలు బంద్

  • వరద ముంపు దృష్ట్యా రాకపోకలు నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ వెల్లడి
  • రెండ్రోజులపాటు వంతెనపై రవాణా నిలిపివేస్తున్నట్లు తెలిపిన కలెక్టర్‌
  • ప్రజలు అధికారులకు సహకరించాలని కోరిన కలెక్టర్‌ అనుదీప్‌

12:11 July 14

భారీ వర్షాలతో నిండుకుండలా మారిన హుస్సేన్‌సాగర్

  • వారంరోజులుగా కురుస్తున్న వర్షాలతో చేరుతున్న వరద నీరు
  • హుస్సేన్‌సాగర్‌లో పూర్తిస్థాయికి చేరిన నీటిమట్టం
  • హుస్సేన్‌సాగర్ నుంచి తూముల ద్వారా నీటివిడుదల

12:11 July 14

సముద్రాల గ్రామాన్ని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి

  • జనగామ జిల్లాలో వర్షానికి కూలుతున్న పురాతన బావిని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
  • బావిని పూడ్చివేసేందుకు రూ.20 లక్షలు మంజూరు చేసిన ఎర్రబెల్లి
  • బావి పూడ్చివేతకు ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులను అభినందించిన ఎర్రబెల్లి

11:56 July 14

జలదిగ్బంధంలో జయశంకర్ జిల్లా

  • జయశంకర్ జిల్లా: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మోరంచ వాగు
  • ఘనపురం కొండాపూర్, సీతారాంపూర్ గ్రామాలకు నిలిచిన రాకపోకలు

11:55 July 14

మంథని పట్టణం చుట్టూ చేరిన బొక్కలవాగు వరద

  • మంథని శివారులో నీటమునిగిన బొక్కలవాగు వంతెన
  • మంథనిలో 12 గంటలుగా నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా
  • 25 ఏళ్ల తర్వాత జలదిగ్బంధంలో చిక్కుకున్న మంథని
  • మంథని పట్టణంలోని వ్యాపార సముదాయాల్లోకి చేరిన వరదనీరు
  • మంథనిలో ఇళ్లలోకి వరదనీరు చేరి పట్టణవాసుల ఇబ్బందులు
  • మంథని నుంచి పెద్దపల్లి, కరీంనగర్‌కు నిలిచిపోయిన రాకపోకలు
  • వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందం యత్నం

11:55 July 14

పెద్దపల్లి: మంథని పట్టణానికి పోటెత్తిన గోదావరి వరద

  • గోదావరి ఒడ్డున ఉన్న గౌతమేశ్వరస్వామి ఆలయం చుట్టూ చేరిన వరద
  • గౌతమేశ్వరస్వామి దేవాలయంలో చిక్కుకుపోయిన 20 మంది
  • వరద అంతకంతకూ పెరుగుతుండడంతో భయాందోళనలో కుటుంబాలు
  • తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు బాధితుల విజ్ఞప్తి

11:55 July 14

నిర్మల్ జిల్లా బాసర వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

  • జ్ఞానసరస్వతి ఆలయం నుంచి గోదావరికి వెళ్లే మార్గం జలమయం
  • గోదావరి నుంచి బాసర ఆలయానికి వెళ్లే రహదారిపై నిలిచిన రాకపోకలు

11:54 July 14

భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • ఉదయం 11 గంటలకు గోదావరిలో 59.90 అడుగులకు చేరిన నీటిమట్టం
  • భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • గోదావరి నదిలో ప్రస్తుతం 17.92 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

11:54 July 14

కరీంనగర్: నగునూరు శివారులో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగు

  • పిల్లలతో సహా ఇటుకబట్టిల వద్ద చిక్కుకుపోయిన ఐదుగురు కూలీలు
  • ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మంత్రి గంగుల
  • కార్మికులను కాపాడేందుకు రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ బృందం

10:58 July 14

నిజామాబాద్ జిల్లాలో వర్షాలపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమీక్ష

  • నిజామాబాద్ కలెక్టర్, మేయర్, కమిషనర్‌తో ప్రశాంత్‌రెడ్డి సమీక్ష
  • జడ్పీ ఛైర్మన్‌, అదనపు కలెక్టర్, నుడా చైర్మన్‌తో ప్రశాంత్‌రెడ్డి సమీక్ష
  • ముంపు ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో చేపట్టిన చర్యలపై ఆరా

10:57 July 14

నిజామాబాద్ శివారులోని ఖానాపూర్ వద్ద వరద ఉద్ధృతి

  • సైకిల్‌తో సహా వరదనీటిలో కొట్టుకుపోయిన వృద్ధుడు
  • గల్లంతైన వృద్ధుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

10:47 July 14

జయశంకర్: కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద

  • ఎగువ నుంచి వచ్చిన వరదతో భారీగా ప్రవాహం
  • మేడిగడ్డ బ్యారేజీ ఇన్‌ఫ్లో 22,15,760 క్యూసెక్కులు
  • మేడిగడ్డ బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
  • అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 14,77,975 క్యూసెక్కులు
  • కాళేశ్వరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత
  • మహాదేవపూర్, కాళేశ్వరం గోదావరి పరివాహక ప్రాంతాల్లో రెడ్‌అలర్ట్
  • పుష్కరఘాట్లను ముంచెత్తి సమీప ఇళ్లలోకి చేరిన వరదనీరు
  • భారీ వరద దృష్ట్యా ముంపు నివాసాలు ఖాళీ చేయించిన అధికారులు
  • కాళేశ్వరం ఘాట్ వద్దకు ఎవరూ రాకుండా పోలీసుల బందోబస్తు
  • కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 15.900 మీటర్ల భారీ ప్రవాహం

10:47 July 14

జలదిగ్బంధంలో మహదేవపూర్ పరిధి గోదావరి తీర ప్రాంతాలు

  • జలమయమైన అన్నారం, చండ్రుపల్లి, నాగపల్లి, మద్దులపల్లి గ్రామాలు
  • జలమయమైన పల్గుల, కుంట్లం, కన్నెపల్లి, బీరాసాగర్ గ్రామాలు
  • ఏటూరునాగారంలో శివాలయం వీధి, ఓడవాడలోకి వచ్చిన వరద
  • జలమయమైన బెస్తవాడ, ఎస్సీ కాలనీ, కుమ్మరివాడ ప్రాంతాలు
  • వరద గుప్పిట్లో దామెరకుంట, లక్ష్మీపూర్, గుండ్రాత్‌పల్లి, మల్లారం
  • రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులు
  • ప్రభుత్వం నుంచి సహాయచర్యల కోసం ఎదురుచూస్తున్న బాధితులు

10:46 July 14

కాళేశ్వరం వద్ద వరద ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది: కేంద్ర జలసంఘం

  • కాళేశ్వరం వద్ద నీటిమట్టం 107.56 మీటర్లకు చేరింది: కేంద్ర జలసంఘం
  • కాళేశ్వరం వద్ద వరద పెరిగే అవకాశం ఉంది: కేంద్ర జలసంఘం

10:18 July 14

భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • ఉదయం 10 గంటలకు గోదావరిలో 59.70 అడుగులకు చేరిన నీటిమట్టం
  • భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • గోదావరి నదిలో ప్రస్తుతం 17.78 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

10:18 July 14

కడెం నారాయణరెడ్డి జలాశయానికి తగ్గుతున్న వరద

  • కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 687 అడుగులు
  • కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
  • కడెం జలాశయంలోకి చేరుతున్న 2 లక్షల క్యూసెక్కులు
  • కడెం జలాశయం 17 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కులు విడుదల

10:18 July 14

కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు తప్పిన ముప్పు

  • కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు తగ్గిన వరద ఉద్ధృతి
  • కడెం ప్రాజెక్టును కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం: ఇంద్రకరణ్‌రెడ్డి
  • ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదు: ఇంద్రకరణ్‌రెడ్డి
  • గతంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు: ఇంద్రకరణ్‌రెడ్డి
  • ప్రజలు ఆందోళన చెందవద్దు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
  • ముంపు ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతాయి: ఇంద్రకరణ్‌రెడ్డి
  • వరద ఉద్ధృతి మరింత తగ్గే అవకాశం ఉంది: ఇంద్రకరణ్‌రెడ్డి
  • విపత్కర పరిస్థితుల్లోనూ అధికారులు సమర్థంగా పనిచేశారు: ఇంద్రకరణ్‌రెడ్డి

09:58 July 14

కడెం నారాయణరెడ్డి జలాశయంలోకి కొనసాగుతున్న వరద

  • కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
  • కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 700 అడుగులు
  • కడెం జలాశయంలోకి చేరుతున్న 3 లక్షల క్యూసెక్కులు
  • కడెం జలాశయం 17 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కులు విడుదల

09:57 July 14

జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

  • రాయికల్, ధర్మపురి, గొల్లపల్లి మార్గాల్లో వంతెనలపై పారుతున్న వరద
  • రాయికల్ మండలం బోర్నపల్లిలో నిలిచిన విద్యుత్ సరఫరా
  • చుట్టూ వరదతో తాగునీటి కోసం అల్లాడుతున్న బోర్నపల్లి గ్రామస్థులు
  • గోదావరి వరదలో నీటమునిగిన బోర్నపల్లి రామాలయం

09:30 July 14

నిజామాబాద్ జిల్లాలో గోదావరి మహోగ్రరూపం

  • రెంజల్ మండలం కందకుర్తి వద్ద పోటెత్తిన వరద
  • కందకుర్తి వంతెన పైనుంచి ప్రవహిస్తున్న గోదావరి వరద
  • మహారాష్ట్ర- నిజామాబాద్‌కు మధ్య నిలిచిన రాకపోకలు
  • సాలూర వద్ద మంజీరా వరద ఉద్ధృతితో మునిగిన పాత వంతెన
  • పాత వంతెన తెగిపోవడంతో మహారాష్ట్ర- బోధన్ మధ్య రాకపోకలు బంద్‌
  • నిజామాబాద్- ఆర్మూర్ శివారు ధోబిఘాట్ వద్ద వరద ప్రవాహం
  • ఆర్మూర్-నిజామాబాద్ ప్రధాన రహదారిని మూసివేసిన అధికారులు
  • నవీపేట మండలంలోని అల్జాపూర్ గ్రామం జలదిగ్బంధం
  • గోదావరి బ్యాక్‌ వాటర్‌తో నీటమునిగిన అల్జాపూర్- యంచ రోడ్డు
  • బ్యాక్‌ వాటర్‌ చేరడంతో అత్యవసర సేవలకూ అంతరాయం

09:30 July 14

భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • ఉదయం 9 గంటలకు గోదావరిలో 59.40 అడుగులకు చేరిన నీటిమట్టం
  • భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
  • గోదావరి నదిలో ప్రస్తుతం 17.58 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

09:29 July 14

జలదిగ్బంధంలో మహదేవపూర్ పరిధి గోదావరి తీర ప్రాంతాలు

  • జలమయమైన అన్నారం, చండ్రుపల్లి, నాగపల్లి, మద్దులపల్లి గ్రామాలు
  • జలమయమైన పల్గుల, కుంట్లం, కన్నెపల్లి, బీరాసాగర్ గ్రామాలు
  • రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులు
  • భూపాలపల్లి: సహాయచర్యల కోసం ఎదురుచూస్తున్న బాధితులు

09:03 July 14

జలదిగ్బంధంలో మంథని పట్టణం

  • మంథని చుట్టూ భారీగా చేరిన వరదనీరు
  • జలదిగ్బంధంలో మంథని పట్టణంలోని బొక్కలవాగు సమీప ప్రాంతాలు
  • మంథని ప్రధాన కూడలిలోకి చేరిన భారీగా వరద నీరు
  • మంథని దుకాణాల్లో వరద నీరు చేరి తడిసిముద్దయిన సామగ్రి
  • అంబేడ్కర్‌నగర్, వాసవీనగర్, లైన్‌గడ్డలో బర్రెకుంటలో ఇళ్లలోకి చేరిన వరద
  • ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు
  • మంథనిలో పూర్తిగా నీటమునిగిన మాతా,శిశు ఆస్పత్రి
  • మాతా, శిశు ఆస్పత్రిలో రాత్రి నుంచి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
  • మంథనిలో వరద బాధితుల పునరావాస కేంద్రం నీటమునక
  • భారీ వరదలతో జలమయమైన మంథని పోలీస్‌స్టేషన్
  • జలదిగ్బంధంతో ఇళ్ల పైకెక్కి సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులు

09:03 July 14

పార్వతీ బ్యారేజ్‌కు పోటెత్తుతున్న భారీ వరద

  • పార్వతీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటిమట్టం 8.83 టీఎంసీలు
  • పార్వతీ బ్యారేజ్‌ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 13,30,660 క్యూసెక్కులు
  • పార్వతీ బ్యారేజ్‌ 74 గేట్లలో 72 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల
  • గోదావరి వరద ఉద్ధృతికి దిగువన ఉన్న గ్రామాలు జరదిగ్బంధం

09:03 July 14

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతి

  • అశ్వాపురం మండలంలో నీటమునిగిన ఆరు గ్రామాలు
  • పినపాక మండలంలో జలదిగ్బంధంలో చిక్కుకున్న మూడు గ్రామాలు
  • ఇప్పటికే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు
  • మణుగూరు మండలం చినరయిగూడానికి నిలిచిన రాకపోకలు

08:27 July 14

భద్రాద్రి: ఇల్లెందు సింగరేణి ఏరియాలో 8వ రోజు నిలిచిన బొగ్గు ఉత్పత్తి

  • భారీ వర్షాలతో చెరువుల మారిన కోయగూడెం ఉపరితల గని
  • కోయగూడెం గనిలో వరదనీటిని మోటార్లతో తోడుతున్న సిబ్బంది
  • కోయగూడెంలో 8 రోజులుగా నిలిచిపోయిన 80వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి
  • 320 వేల క్యూబిక్ మీటర్ల మట్టివెలికితీత పనులకు అంతరాయం

08:05 July 14

నిజామాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు

  • మెండోరాలో 23.9 సెం.మీ వర్షపాతం నమోదు
  • నిజామాబాద్ జిల్లాలో నిండుకుండలా 1067 చెరువులు
  • నిజామాబాద్‌ జిల్లాలో వరద ఉద్ధృతికి 14 చెరువులకు గండ్లు
  • నిజామాబాద్ జిల్లాలో 32,482 ఎకరాల్లో నీటమునిగిన పంటలు

08:05 July 14

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పెరిగిన వరద

  • నిజాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 21,760 క్యూసెక్కులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1397.82 అడుగులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1405 అడుగులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 9.156 టీఎంసీలు

08:03 July 14

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రికార్డు స్థాయిలో వరద

  • ఎగువ నుంచి వచ్చిన వరదతో భారీగా ప్రవాహం
  • మేడిగడ్డ బ్యారేజీకి 22,15,760 క్యూసెక్కుల వరద
  • మేడిగడ్డ బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
  • అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 14,77,975 క్యూసెక్కులు
  • కాళేశ్వరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత
  • మహాదేవపూర్, కాళేశ్వరం గోదావరి పరివాహక ప్రాంతంలో రెడ్ అలెర్ట్ జారీ
  • పుష్కర ఘాట్లను ముంచెత్తి సమీప ఇళ్లలోకి చేరిన వరద
  • భారీ వరదతో నివాస ప్రాంతాలను ఖాళీ చేయించిన అధికారులు
  • కాళేశ్వరం ఘాట్ వద్దకు ఎవరూ రాకుండా పోలీసుల బందోబస్తు
  • కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 15.900 మీటర్ల మేర భారీ ప్రవాహం

07:14 July 14

కరీంనగర్ జిల్లా గంగాధరలో తెగిన ఎల్లమ్మ చెరువుకట్ట

  • గంగాధర, నారాయణపూర్ గ్రామాల్లోకి చేరుకున్న వరదనీరు
  • గ్రామస్థులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న అధికారులు
  • రామడుగు మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మోతే వాగు

07:06 July 14

ఎగువ ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు భారీగా వరదనీరు

  • జూరాల జలాశయం ఇన్‌ఫ్లో 1,06,500 క్యూసెక్కులు
  • జూరాల ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి 1,06,772 క్యూసెక్కులు విడుదల
  • జూరాల జలాశయం పూర్తి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు
  • జూరాల జలాశయం ప్రస్తుత నీటినిల్వ 6.896 టీఎంసీలు

07:05 July 14

వరద సహాయక చర్యల్లో గల్లంతైన రెస్క్యూ సిబ్బంది మృతి

  • ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన సింగరేణి రెస్క్యూ బృందం
  • మృతులు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ వాసులు రాము, సతీశ్​
  • శ్రీరాంపూర్ సింగరేణి రెస్క్యూ బృందంలో పనిచేస్తున్న రాము, సతీశ్‌
  • నిన్న వరదలో గర్భిణిని కాపాడే ప్రయత్నంలో గల్లంతైన రాము, సతీశ్‌

07:05 July 14

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తిన అధికారులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4,18,510 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 4.50 లక్షల క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1087.40 అడుగులు
  • శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 74.506 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 90.30 టీఎంసీలు

07:04 July 14

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కొనసాగుతన్న వరద ప్రవాహం

  • ఎల్లంపల్లి ప్రాజెక్టు 62 గేట్లలో 54 గేట్ల ఎత్తివేత
  • ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 13 లక్షల క్యూసెక్కులు
  • ఎల్లంపల్లి ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 13.30 లక్షల క్యూసెక్కులు

06:35 July 14

కడెం జలాశయానికి కొనసాగుతున్న వరద

  • కడెం సామర్థ్యం 700 అడుగులకుగాను పూర్తిస్థాయి నీటిమట్టం
  • కడెం ప్రాజెక్టు ఇరువైపులా గట్లపై నుంచి పారుతున్న వరదనీరు
  • ఎన్ని టీఎంసీల నీరు ప్రవహిస్తుందనేది లెక్కించలేని పరిస్థితి
  • ఎగువన మోస్తరుగా కురుస్తున్న వర్షంతో కడెం ప్రాజెక్టుకు వరద
  • సురక్షిత ప్రాంతాలకు కడెం గ్రామస్థులను తరలించిన అధికారులు

06:29 July 14

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక చేసిన అధికారులు

  • భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం: గోదావరిలో 58.50 అడుగులకు చేరిన నీటిమట్టం
  • భద్రాచలం: మూడో ప్రమాద హెచ్చరిక చేసిన అధికారులు
  • భద్రాచలం వద్ద ప్రస్తుతం 17.14 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

06:29 July 14

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

  • ఆలమట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల
  • జూరాల, తుంగభద్ర నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా విడుదల
  • పది రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం

06:29 July 14

భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం: గోదావరిలో 58.10 అడుగులకు చేరిన నీటిమట్టం
  • భద్రాచలం: మూడో ప్రమాద హెచ్చరిక చేసిన అధికారులు
  • భద్రాచలం వద్ద ప్రస్తుతం 16.96 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

06:28 July 14

ఇంటెక్‌వెల్ వద్ద చిక్కుకున్న ఏడుగురు కార్మికులు

  • పెద్దపల్లి: గోదావరిఖని కోల్‌బెల్ట్ వంతెన వద్ద ఇంటెక్‌వెల్‌లో చిక్కుకున్న కార్మికులు
  • కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు సింగరేణి అధికారుల ప్రయత్నం

06:26 July 14

RAINS LIVE UPDATES

మంథని మండలంలో అర్ధరాత్రి ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పర్యటన

  • ముంపు బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
  • పునరావాస కేంద్రాల్లో బాధితులను పరామర్శించిన శ్రీధర్‌బాబు
  • భోజన సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
Last Updated : Jul 14, 2022, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details