కృష్ణమ్మ ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. జూరాలకు 2లక్షల 3వేల ప్రవాహం వచ్చిచేరుతుండగా.... 2లక్షల 13వేల 913క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇక్కడి నుంచి తుంగభద్ర నదీ సంగమంతో... శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ఎగువ నుంచి 3 లక్షల 98వేల 980 క్యూసెక్కులు వస్తుండగా.... 4లక్షల 3వేల 937 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌వైపుగా పరుగులుతీస్తోంది. శ్రీశైలం పూర్తినీటిమట్టం.... 885అడుగులు కాగా.... ప్రస్తుతం 884.50 అడుగుల మేర కొనసాగుతోంది. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 215.81టీఎంసీలకు గాను.... 212.92టీఎంసీల నీటి నిల్వ ఉంది.
సాగర్ సోయగం...
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు 3లక్షల 77వేల 594 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా... అంతే మొత్తంలో నీటిని కిందికి వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.... ప్రస్తుతం నీటి నిల్వ 311.45 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.... 589.80 అడుగుల మేర నీటిమట్టం కొనసాగిస్తున్నారు.