తెలంగాణ

telangana

ETV Bharat / city

పీఆర్‌సీ గడువు పెంపు... ఫిబ్రవరి 25 వరకు పొడిగింపు

పీఆర్​సీ గడువును వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేతన సవరణపై నివేదిక సిద్ధమయినా... సేవా నిబంధనల రూపకల్పన బాధ్యతల దృష్ట్యా వ్యవధి పెంపుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

telangana prc time extended
telangana prc time extended

By

Published : Nov 29, 2019, 7:34 AM IST

వేతన సవరణ సంఘం (పే రివిజన్‌ కమిషన్‌- పీఆర్‌సీ) గడువును వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నిర్దేశించిన గడువు ఆగస్టు 25తో ముగియగా అప్పటి నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వర్తిస్తాయని పేర్కొంది. వేతన సవరణపై నివేదిక సిద్ధమయినా... సేవా నిబంధనల రూపకల్పన బాధ్యతల దృష్ట్యా వ్యవధి పెంపుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రెండు సార్లు పెంపు

రాష్ట్ర అవతరణ తర్వాత తొలి వేతన సవరణ సంఘం 2018 మే 18న ఏర్పాటైంది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి సీఆర్‌ బిస్వాల్‌ అధ్యక్షతన మరో ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌లు ఉమామహేశ్వర్‌రావు, రఫత్‌అలీ సభ్యులుగా కమిటీ ఏర్పడింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని మొదట్లో సంఘానికి సూచించారు. ఆ గడువు నాటికి నివేదిక పూర్తి కాలేదు. దీంతో వ్యవధిని మొదట్లో మూడు నెలలు, తర్వాత ఆరు నెలల చొప్పున పెంచారు.

సర్వీస్​ రూల్స్​ రూపకల్పన వల్లే ఆలస్యం

ఆగస్టు 25 తర్వాత గడువు పెంపు ఉత్తర్వులు జారీ కాలేదు. తాజాగా పీఆర్‌సీ నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఈ నెల రెండో వారంలో వేతన సవరణ సంఘాన్ని ఆదేశించింది. నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు రంగం సిద్ధమయింది. పీఆర్‌సీకి వేతన సవరణతో పాటు సేవా నిబంధనల (సర్వీస్‌ రూల్స్‌) రూపకల్పన బాధ్యతలను అప్పగించింది. దీనిపై పీఆర్‌సీ పని ప్రారంభించింది. వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. దీని కోసమే ప్రభుత్వం పీఆర్‌సీ గడువును వచ్చే ఫిబ్రవరి వరకు పెంచినట్లు తెలుస్తోంది.

వెబ్‌సైట్‌లో లేదు

వ్యవధి పెంపుదల జీవో ఈ నెల 19న జారీ అయినా... దానిని ఇప్పటి వరకు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చేర్చలేదు. తాజాగా అది వెలుగులోకి వచ్చింది. పీఆర్‌సీ నివేదికను సమర్పించడానికి 12 రోజులు గడువు ఇచ్చిన తర్వాత ఈ ఉత్తర్వులు వచ్చాయి. ఆగస్టు 25న గడువు ముగిసినా... కొనసాగింపులో జాప్యం బయటపడుతుందనే కారణంతో పాటు రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, ఇతర పరిణామాల దృష్ట్యా జీవోను బహిర్గతం చేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు

ABOUT THE AUTHOR

...view details