"రాష్ట్రంలో బొగ్గు, విద్యుత్ సంక్షోభం లేదు. రాష్ట్రంలో 200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. రాష్ట్రంలో రోజుకు లక్షా 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. అందులో 30 నుంచి 32 టన్నులు మాత్రమే ఉపయోగిస్తున్నాం. దాదాపు లక్షా 40 వేల టన్నులకు పైగా ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నాం. అదనంగా ఉన్న బొగ్గును ఇతర రాష్ట్రాలకు అందిస్తున్నాం.
Coal Crisis: 'రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం లేదు.. 200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి' - coal shortage in india
రాష్ట్రంలో 2 వందల ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని... విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. అదనంగా ఉన్న బొగ్గును ఇతర రాష్ట్రాలకు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లను బిగిస్తామనే ప్రచారంలో ఎటువంటి నిజంలేదని... మంత్రి స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం కచ్చితంగా మీటర్లు బిగించాలని ఒత్తిడి తెస్తే... అప్పుడు ఆలోచిస్తామని తెలిపారు. రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి, సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామంటున్న మంత్రి జగదీశ్‌రెడ్డితో ఈటీవీ ముఖాముఖి.
వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మోటర్లు బిగించాలనే ఆలోచన లేదు. కొన్ని విషయాల్లో కేంద్రం రాష్ట్రాల స్వేచ్ఛను హరిస్తోంది. వీలైనంత వరకు రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంతో పోరాడతాం. కేంద్రం విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు కుట్ర చేస్తోందని విమర్శకుల వాదన. బిగించాలని కేంద్రం ఒత్తిడి చేస్తే అప్పుడు ఆలోచిస్తాం. స్మార్ట్ మీటర్ల అమలు మొదట ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రారంభించాం. బొగ్గు ఉత్పత్తి, సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం." - జగదీశ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి
ఇదీ చూడండి: