తెలంగాణ

telangana

ETV Bharat / city

రహదారులపైకి వాహనదారులు.. సీజ్ చేస్తున్న పోలీసులు

By

Published : May 20, 2021, 11:58 AM IST

Updated : May 20, 2021, 12:44 PM IST

vehicles seize, vehicles seize in Hyderabad
వాహనాల జప్తు, తెలంగాణలో వాహనాలు సీజ్, హైదరాబాద్​లో వాహన తనిఖీలు

11:55 May 20

లాక్​డౌన్​ సమయంలో రోడ్లపైకి వాహనదారులు.. సీజ్ చేస్తున్న పోలీసులు

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు సీజ్

రాష్ట్రంలో లాక్​డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న కొందరు వాహనదారులు మాత్రం విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో.. ఉదయం 10 గంటల తర్వాత రహదారులపైకి వచ్చిన వాహనాలను భాగ్యనగర పోలీసులు సీజ్ చేస్తున్నారు. నగరంలోని 330 తనిఖీ కేంద్రాల వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతి లేని వాహనాలను జప్తు చేస్తున్నారు. 

హైదరాబాద్ పరిధిలో విస్తృత వాహన తనిఖీలు చేపట్టిన పోలీసుల ఇప్పటివరకు 200 వాహనాలు సీజ్ చేశారు. కరోనా వ్యాప్తి అరికట్టడానికి లాక్​డౌన్ విధిస్తే.. కొందరు మాత్రం పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Last Updated : May 20, 2021, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details