పనివాళ్ల(maid)ను నియమించుకునేటప్పుడు వారి వివరాలు తమకు తెలియజేస్తే... విచారించి మంచివాళ్లా? చెడ్డవాళ్లా? అన్నది చెప్పేస్తామంటూ పోలీస్ ఉన్నతాధికారులు(telangana police) చెబుతున్నారు. రాజధానిలో విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పనికోసం వచ్చి రూ.కోట్లు కొట్టేసి వెళ్తున్న ఘటనలు పెరుగుతుండటంతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. నేరం జరిగాక దొంగలు, నేరస్థులను పట్టుకోవడం కంటే...ఇళ్లలో పనికి కుదురుకోకముందే వారి నేరచరిత(criminals history)పై సమాచారం సేకరించి ఇంటి యజమానులకు ఉచితంగా తెలపనున్నారు. ఇందుకోసం ఇంటి యజమానులు చేయాల్సిందిల్లా... హాక్‌ఐ మొబైల్(hawk eye mobile app) యాప్‌లో విధుల్లోకి చేరేముందే పనివాళ్లు ఇచ్చిన ఆధార్, ఫోన్ నంబర్లు నమోదు చేయడం, లేదా బ్లూకోల్ట్ పోలీసులకు ఆ వివరాలు ఇవ్వడమేనని వివరిస్తున్నారు. రెండు నెలల్లో 45 వేలమంది హాక్‌ఐ మొబైల్‌యాప్(hawk eye app) ద్వారా తమను సంప్రదించగా.. వారికి సాయం చేశామని వివరించారు. వయోధికులు, పిల్లలు విదేశాల్లో..ఇక్కడ భార్యాభర్తలు మాత్రమే ఉంటున్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
ప్రైవేటు ఏజెన్సీలు..
ప్రస్తుతం పనివాళ్లు(maid) అవసరమైనవారు ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. వారికి నెలకు రూ.20వేలు చెల్లిస్తే చాలు.. పనివాళ్లకు గుర్తింపు కార్డులిచ్చి పంపుతున్నారు. పనివాళ్లు ఏదైనా దొంగతనం చేసినా, చేతివాటం చూపించినా... ప్రైవేటు ఏజెన్సీలదే బాధ్యత. మరోవైపు అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉంటున్న వారిళ్లలో పనిచేసేందుకు కొంతమంది కాంట్రాక్టర్లు తమ మనుషులను పంపుతున్నారు. పైకి ఇదంతా సవ్యంగానే కనిపించినా నేపాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్‌ల నుంచి పనికోసం వస్తున్న వారిలో కొందరు నేరాలు చేసేందుకు మాత్రమే వస్తున్నారు. హైదరాబాద్‌కు వచ్చాక తమకు తెలిసినవారి వద్దకు వచ్చి పని ఇప్పించాలంటూ కోరుతున్నారు. నకిలీ గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. వీరి సాయంతో ఇళ్లల్లో పనిచేసేందుకు కుదురుకుని తర్వాత రూ.లక్షలు కొల్లగొట్టి పారిపోతున్నారు.
నేరచరితపై ఆరా..
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో 162 పోలీస్ ఠాణాలున్నాయి. ఆయా పోలీస్ ఠాణాల పరిధుల్లో నివాసముంటున్నవారు.