సైబర్ నేరస్థులు.. కొత్త కొత్త ఎత్తులతో ప్రజలను మోసగిస్తున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలను చోరీ చేయడం, వ్యక్తిగత సమాచారం తస్కరించడం ద్వారా ప్రజల ఖాతాల్లోని సొమ్మును కొళ్లగొడుతున్నారు. క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు ఓటీపీలు చెప్పించుకొని తద్వారా ఖాతాల్లో సొమ్ము మాయం చేస్తున్నారు. బ్యాంకర్ల అవతారమెత్తి.. ఖాతాలను అప్‌డేట్ చేసుకోవాలని, పాన్‌కార్డు అనుసంధానమని, ఆధార్‌కార్డు అనుసంధానమని మాటలు కలిపి వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాకింగ్ వివరాలను.. దోచేస్తున్నారు. మొబైల్ ఫోన్‌లను హ్యాక్ చేసి తద్వారా బ్యాంకు సంబంధిత వివరాలను తస్కరిస్తున్నారు.
గైడ్‌లైన్స్
ప్రపంచ వ్యాప్తంగా, జాతీయ స్థాయిలో మంచి పేరున్న కంపెనీలు, సంస్థలకు చెందిన నకిలీ లింకులను మొబైల్‌కు మెసేజ్ చేయడం, ఈ-మెయిల్‌కు పంపడం.. వాటిని తెరిచి అడిగిన వివరాలు నమోదు చేయగానే ఖాతాదారుడి బ్యాంకు సంబంధ, వ్యక్తిగత సమాచారం అంతా కాపీ చేసుకుని తద్వారా మోసాలకు ఒడిగడుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని మొబైల్ ఫోన్‌లను సురక్షితంగా ఉంచుకోడానికి అనుసరించాల్సిన కొన్ని సూచనలను, సలహాలను సైబరాబాద్ పోలీసులు సిద్దం చేశారు.