తెలంగాణ

telangana

ETV Bharat / city

చాయ్​వాలా, ఇస్త్రీకార్మికుడు, మెకానిక్​.. వీళ్లే చైనా సంస్థల డైరెక్టర్లు!

దిల్లీలోని గుర్‌గావ్‌లో ఉంటున్న చాయ్‌వాలా. జేఎండీ ఎంపైర్‌కు సమీపంలో నివసిస్తున్న ఇస్త్రీ బండి వ్యక్తి. కరోల్‌బాగ్‌లోని ఓ మెకానిక్‌. వీళ్లంతా చైనా సంస్థల్లో డైరెక్టర్లే. డోకీపే, లింక్‌యున్‌తోపాటు మరో 30 సంస్థల్లో ఇలాంటి వారే డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. వీళ్లలో ఎవరికీ మరొకరితో సంబంధాలు ఉండవు. అసలు తాము డైరెక్టర్లమనే విషయమే వారికి తెలియదు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కంపెనీ కేసులో దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్‌ పోలీసుల పరిశోధనలో బహిర్గతమై లోగుట్టు ఇది.

telangana police filed cases on online betting companies
చాయ్​వాలా, ఇస్త్రీకార్మికుడు, మెకానిక్​.. వీళ్లే చైనా సంస్థల డైరెక్టర్లు!

By

Published : Sep 6, 2020, 8:35 AM IST

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహణ, ఈ-కామర్స్‌ సంస్థల ఏర్పాటుకు నిందితులు మూడేళ్ల క్రితమే పథకం వేసి అమలు చేశారని దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. ‘చైనా దేశీయులు డైరెక్టర్లుగా ఉంటే భారత్‌లో ఈ-కామర్స్‌ సంస్థల్ని ప్రారంభించడం కుదరదని దిల్లీలోని కొందరు ఆడిటర్ల ద్వారా నిందితులు తెలుసుకున్నారు. ఆడిటర్ల సూచన మేరకు వాళ్లు కొన్ని ఏజెన్సీలను సంప్రదించారు. వారి సహకారంతో వృత్తి పనిచేసే వాళ్ల గుర్తింపు కార్డులతో కంపెనీలను రిజిస్టర్‌ చేశారు. వాళ్లనే ఆయా కంపెనీల డైరెక్టర్లుగా చూపారు. మూణ్నెల్లకు ఒకసారి డైరెక్టర్లంతా సమావేశమైనట్టు, వారికి లక్షల్లో జీతాలు చెల్లించినట్టు కాగితాల్లో సృష్టించారు. నిజానికి ఆ పేర్లతో ఉన్న వారికి ఈ విషయమే తెలియదని’ దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు సమాచారం.

చైనా కంపెనీల నిర్వాహకులు జైల్లో ఉండడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు డోకీపీ, లింక్‌యున్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిని గుర్‌గావ్‌, కాన్పుర్‌ల నుంచి ఇక్కడికి రప్పించారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆడేందుకు వీలుగా టెలిగ్రామ్‌ యాప్‌లో వస్తున్న వందల వెబ్‌సైట్లను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? జీతభత్యాలు తదితరాలపై ఉద్యోగులను ప్రశ్నించారు. టెలిగ్రామ్‌ యాప్‌ నిర్వహణ ఓ సాఫ్ట్‌వేర్‌ ద్వారా జరుగుతోందని, ఇందులో మానవ ప్రమేయం లేదని వారు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. కాల్‌ సెంటర్‌ ఉద్యోగుల తరహాలోనే తమకు నెలకు రూ.10-15 వేల వరకు జీతాలిస్తున్నారని, ఆర్థిక వ్యవహారాలు, డిజిటల్‌ నగదు బదిలీల గురించి తమకు తెలియదని వారు చెప్పినట్టు తెలిసింది.

రాష్ట్రవ్యాప్తంగా కేసులు.. మరిన్ని వెబ్‌సైట్లు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న చైనా కంపెనీలపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. కంపెనీల నిర్వాహకులను అరెస్టు చేశారనే సమాచారం తెలుసుకున్న బాధితులు తాము కూడా రూ.లక్షల్లో మోసపోయామంటూ వివిధ జిల్లాల్లోని పోలీసు ఠాణాలకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. వాటి అధారంగా 60 కొత్త వెబ్‌సైట్లను పోలీసులు గుర్తించారు.

ఇవీచూడండి:అమానుషం... భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

ABOUT THE AUTHOR

...view details