ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల దాడిలో వీర మరణం పొందిన తెలుగు జవాను శాఖమూరి మురళీకృష్ణకు..... శంషాబాద్ విమానాశ్రయం వద్ద సీఆర్పీఎఫ్ అధికారులు, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు. సోమవారం రాత్రి 11 గంటల 40నిమిషాలకు మురళీకృష్ణ పార్థీవదేహం శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంది. సీపీ సజ్జనార్, సీఆర్పీఎఫ్ అధికారులు పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళి తెలిపారు. అనంతరం పార్థీవదేహాన్ని మురళీకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి తరలించారు.
జవాను మురళీకృష్ణకు రాష్ట్ర పోలీసుల నివాళి - ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల దాడి
ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల దాడిలో వీర మరణం పొందిన తెలుగు జవాను శాఖమూరి మురళీకృష్ణకు సీఆర్పీఎఫ్ అధికారులు, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు. శంషాబాద్ విమానాశ్రయంలో మురళీకృష్ణ పార్థీవదేహానికి పుష్పగుచ్ఛాలు సమర్పించారు.
Telangana police and crpf police condolence to murali krishna
అమర జవాన్లకు తెలంగాణ పోలీస్ శాఖ నుంచి జోహార్లు. అమర జవాన్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా. అమర జవాన్లను స్ఫూర్తిగా తీసుకుని అందరం పనిచేయాలి. మురళీకృష్ణ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం.- సజ్జనార్, సైబరాబాద్ సీపీ.
ఇవీ చూడండి:'400మంది నక్సల్స్.. బుల్లెట్ల వర్షం కురిపించారు '
Last Updated : Apr 6, 2021, 5:26 AM IST