తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Debts: అభివృద్ధి కోసమే ప్రభుత్వం అప్పులు చేస్తోంది: వినోద్​కుమార్​ - తెలంగాణ రాష్ట్ర అప్పులు

Telangana Debts: అభివృద్ధి, మూలధన వ్యయం కోసమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్​, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివరించారు. అర్థ గణాంకశాఖ రూపొందించిన స్టాటిస్టికల్ అబ్​స్ట్రాక్ట్​ను విడుదల చేశారు.

vinod kumar
vinod kumar

By

Published : Feb 23, 2022, 7:08 PM IST

Telangana Debts: ప్రాజెక్టుల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ స్పష్టం చేశారు. 2022 సంవత్సరానికి సంబంధించి అర్థ గణాంకశాఖ రూపొందించిన స్టాటిస్టికల్ అబ్​స్ట్రాక్ట్​ను.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో కలిసి వినోద్​కుమార్ విడుదల చేశారు.

రాష్ట్ర ఆవిర్భావం మొదలు రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి సంబంధించిన వివరాలు, ఇతర రాష్ట్రాలు, దేశ పరిస్థితులతో పోలుస్తూ చేసిన విశ్లేషణను ఇందులో పొందుపరిచారు. కీలకమైన రంగాలు, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు సహా ఇతర వివరాలు ఇందులో ఉన్నాయి. మూలధన వ్యయం ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యమని ఇందులో ప్రభుత్వం తెలిపింది.

కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో భౌగోళిక సర్వూపం వివరాలతో పాటు కొత్త జోనల్ విధానానికి సంబంధించిన అంశాలను ఈ అబ్​స్ట్రాక్ట్​లో పొందుపరిచారు. నిర్దేశిత షరతులు, విధివిధానాలను అనుగుణంగా.. అభివృద్ధి, మూలధన వ్యయం కోసమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని వినోద్ కుమార్​, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివరించారు. కేంద్రం నుంచి ఏ మాత్రం తోడ్పాటులేదని వినోద్​కుమార్​ ఆరోపించారు.

'తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతి నిర్మాణం విలువ పదిరెట్లు పెరిగింది. తీసుకొచ్చిన అప్పు వృథా చేస్తేనే తప్పుపట్టాలి. ప్రతి నెల మొదటి వారంలోనే తీసుకొచ్చిన రుణానికి.. వడ్డీ సహా ఇన్​స్టాల్​మెంట్ కడుతున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు.'

- వినోద్​కుమార్​, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు

Telangana Debts: అభివృద్ధి కోసమే ప్రభుత్వం అప్పులు చేస్తోంది: వినోద్​కుమార్​

ఇదీచూడండి:చివరి రక్తంబొట్టు ధారపోసైనా దేశాన్ని సరైన మార్గంలో పెడతా: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details