తెలంగాణ

telangana

ETV Bharat / city

కాలేేజీలు తెరవాలని రోడ్డెక్కిన విద్యార్థులు - PG students demands to conduct exams

విద్యాసంస్థలు తెరవాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ ప్యారడైజ్ కూడలిలో పీజీ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ హాస్టల్​తో పాటు సంక్షేమ వసతి గృహాలను తెరవాలని డిమాండ్ చేశారు.

Telangana PG students demands to open educational institutions
విద్యాసంస్థలు తెరవాలని పీజీ విద్యార్థుల డిమాండ్

By

Published : Mar 25, 2021, 11:14 AM IST

Updated : Mar 25, 2021, 12:05 PM IST

తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలు మూసివేయడం వల్ల వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు రోడ్డున పడుతున్నారని పీజీ కళాశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో ఇబ్బందులు కల్గించడం వల్ల చదువులో వెనుకబడుతున్నారని అన్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ రహదారిలో బైఠాయించిన పీజీ విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

విద్యాసంస్థలు తెరవాలని పీజీ విద్యార్థుల డిమాండ్

విద్యార్థుల రాస్తారోకోతో బేగంపేట నుంచి ప్యారడైజ్​కు వెళ్లే వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులకు చెప్పి వారిని రోడ్డు పక్కకు తీసుకెళ్లారు.

విద్యాసంస్థలు తెరిచి పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఓయూ హాస్టల్​తో పాటు సంక్షేమ వసతిగృహాలు తెరవాలని కోరారు.

Last Updated : Mar 25, 2021, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details