పెట్రోలియం డీలర్లకు కమీషన్ పెంచాలని కోరుతూ ఈ నెల 31న ఆయిల్ డిపోల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనరాదని నిర్ణయించినట్లు తెలంగాణ పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎం. అమర్నాథ్రెడ్డి తెలిపారు. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్... సకాలంలో సరఫరా చేయకపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయని.. అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు హెచ్పీసీఎల్ రాష్ట్ర సమన్వయకర్త ఎతేంద్ర పాల్సింగ్కు వినతిపత్రం సమర్పించారు.
ఈనెల 31న 'నో పర్చేజ్ ప్రొటెస్ట్ కాల్'కు పిలుపిచ్చిన పెట్రోలియం డీలర్లు - తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31న తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ "నో పర్చేజ్ ప్రొటెస్ట్ కాల్''కు పిలుపునిచ్చింది. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్... సకాలంలో సరఫరా చేయకపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయని... అసోసియేషన్ తెలిపింది. 2017 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపు అయినా... డీలర్ మార్జిన్ పెంచలేదని పేర్కొంది.
2017 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపు అయినా... డీలర్ మార్జిన్ పెంచలేదని పేర్కొంది. ఎక్సైజ్ సుంకం తగ్గించిన ప్రతిసారీ.. తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపింది. గతేడాది నవంబరు 4న ఎక్సైజ్ సుంకం తగ్గించినపుడు ఒక్కోడీలర్‌పై 8 నుంచి 15లక్షల వరకు నష్టం వచ్చినట్లు అసోషియేషన్ తెలిపింది. ఈనెల 22న మరోసారి ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ఒక్కో డీలర్ 4లక్షల నుంచి 10లక్షల వరకు నష్టపోయినట్లు...పేర్కొంది. సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా... ప్రయోజనం లేకపోవడంతో ఈ నెల 31న చమురు సంస్థల నుంచి పెట్రోల్, డీజిల్ కొనబోమని.. తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ తెలిపింది. బంకుల్లో నిల్వలు ఉన్నంతవరకు విక్రయాలు... యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఎక్సైజ్ డ్యూటీ లాభనష్టాలతో సంబంధం లెకుండా డీలర్లకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో ప్రజలకు మేలు జరిగినా, ఆ మొత్తాన్ని ముందుగానే చెల్లించి ఉత్పత్తులు కొనుగోలు చేసిన డీలర్లకు తిరిగి చెల్లింపులు చేయాలి. డీలర్లకు మేలు చేసేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నాం అని లేఖలో పేర్కొన్నారు.
ఇవి చదవండి:45 కంపెనీలతో భేటీ... రాష్ట్రానికి రూ. 4,200 కోట్ల పెట్టుబడులు...