తెలంగాణ

telangana

ETV Bharat / city

టీపీసీసీ ప్రతినిధుల ఎంపికలో అవకతవకలు.. అధిష్ఠానానికి రేవంత్ ఫిర్యాదు - తెలంగాణ పీసీసీ

confusion in the selection of Telangana PCC representatives: తెలంగాణ పీసీసీ ప్రతినిధుల ఎంపిక విషయంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్​ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు.

టీపీసీసీ ప్రతినిధుల ఎంపికలో అవకతవకలు.. అధిష్ఠానానికి రేవంత్ ఫిర్యాదు
టీపీసీసీ ప్రతినిధుల ఎంపికలో అవకతవకలు.. అధిష్ఠానానికి రేవంత్ ఫిర్యాదు

By

Published : Sep 27, 2022, 12:40 PM IST

confusion in the selection of Telangana PCC representatives: తెలంగాణ పీసీసీ ప్రతినిధుల ఎంపిక విష‌యంలో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. పీసీసీ ప్ర‌తినిధుల ఎంపిక కోసం తెలంగాణ‌కు వ‌చ్చిన ఏఐసీసీ ఎన్నిక‌ల అధికారి చేతివాటం ప్ర‌ద‌ర్శించార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. అర్హ‌త కాని వారిని ఈ జాబితాలోకి చేర్చార‌ని వారు విమర్శించారు. టీపీసీసీ అధ్య‌క్షుడికి కానీ, ఇత‌ర నాయ‌కుల‌కు తెలియ‌కుండా ప‌లువురిని జాబితాలో చేర్చ‌డం తీవ్ర గంద‌ర‌గోళానికి దారి తీసింది.

వాస్త‌వానికి ఒక్కో నియోజ‌క వ‌ర్గానికి ఇద్ద‌రు చొప్పున 119 నియోజ‌క వ‌ర్గాల‌కు 238 మంది పీసీసీ ప్ర‌తినిధులు ఉండాలి. అదేవిధంగా ఇందులో 15 శాతం కో-ఆప్షన్​ స‌భ్యులను ఉంచాలి. అంటే ఈ లెక్కన చూసుకుంటే 274 మంది సభ్యులు ఉండాలి. కానీ ఏఐసీసీ ఎన్నిక‌ల అధికారి రూపొందించిన జాబితాలో 301 మంది పేర్లు ఉన్నాయి. ఇందులో 27 మంది అద‌నంగా ఉండ‌డం, వారిలో చాలా మంది అర్హులుకాని వారుండ‌డంతో టీపీసీసీ తీవ్ర అభ్యంత‌రం తెలిపింది. దీనిపై ఇప్ప‌టికే ఏఐసీసీ కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీకి టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, వ‌ర్కింగ్ ప్ర‌ెసిడెంట్ మ‌హేశ్​కుమార్ గౌడ్ ఫిర్యాదు చేశారు.

ఈ జాబితాపై స‌మీక్ష నిర్వ‌హించి అర్హులు కాని వారికి జాబితాలో చోటు క‌ల్పించ‌డంపై పార్టీలో వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు తెర‌దించాల‌ని కోరుతున్నారు. ఈ ప్ర‌తినిధుల‌ ఎంపిక విష‌యంలో పీసీసీకి కూడా తెలియ‌కుండా పార్టీలో కీల‌క‌మైన వారికి కాకుండా అన‌ర్హుల‌కు చోటు క‌ల్పించి పార్టీ కోసం ప‌ని చేస్తున్న త‌మ‌కు ఎందుకు అవ‌కాశం క‌ల్పించ‌లేద‌ని చాలా మంది సీనియ‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే విష‌యాన్ని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్య‌ద‌ర్శి బోసురాజుల దృష్టికి తీసుకెళ్లిన ప‌లువురు నాయ‌కులు.. త‌మ‌కు కూడా పీసీసీ ప్ర‌తినిధులుగా అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో పీసీసీ ప్ర‌తినిధుల జాబితాను ప్ర‌క్షాళ‌న చేసి అర్హులైన వారికే అవ‌కాశం కల్పించి పార్టీలో నెల‌కొన్న గంద‌ర‌గోళానికి తెర‌దించాల‌ని పీసీసీ వ‌ర్గాలు కోరుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details