పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్టు తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవన్లో చైతన్య సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థలకు, పరిషత్‌లకు రానున్న బడ్జెట్లో నిధులు, విధులు, అధికారాలు బదలాయిస్తే... కేసీఆర్‌కు అభినందన సభ నిర్వహిస్తామని తెలిపారు. లేకుంటే ఉద్యమ సభ జరుపుతామని హెచ్చరించారు.
'నిధులు కేటాయిస్తే అభినందన సభ.. లేదంటే ఉద్యమ సభ' - తెలంగాణ పంచాయతీ ఛాంబర్ సమావేశం
హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవన్లో... తెలంగాణ పంచాయతీ ఛాంబర్ చైతన్య సదస్సు జరిగింది. వచ్చే బడ్జెట్లో పంచాయతీ, పరిషత్‌లకు నిధులు, విధులు, అధికారాలు బదలాయించాలని సమావేశంలో డిమాండ్ చేశారు.
!['నిధులు కేటాయిస్తే అభినందన సభ.. లేదంటే ఉద్యమ సభ' telangana panchayat chamber meeting in fatcci bhavan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10638923-thumbnail-3x2-zptc.jpg)
పంచాయతీ, పరిషత్‌లకు నిధులు, విధులు బదలాయించాలి: పంచాయతీ ఛాంబర్
తమకు నిధులు కేటాయించకపోవడంతో... గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిధులను కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా కేటాయిస్తారా..? రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా కేటాయిస్తారా..? అనే విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేయాలన్నారు. నేరుగా రాష్ట్ర ఆర్ధిక సంఘం ద్వారా నిధులు కేటాయించి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్త పంచాయితీ చట్టాలను బడ్జెట్లో సవరణ చేయాలని కోరారు.