తెలంగాణ

telangana

ETV Bharat / city

స్వాతి లక్రా, బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర‌ప‌తి విశిష్ట సేవా పోలీసు ప‌త‌కాలు - independence day news

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రహోంశాఖ పోలీసులకు పతకాలను ప్రకటించింది. వీరిలో అదనపు డీజీ స్వాతి లక్రా, జనగామ డీసీపీ బి.శ్రీనివాస్ రెడ్డికి ప్రెసిడెంట్ పోలీస్ సేవా పతకం దక్కింది.

telangana-officials-got-police-medals-from-union-home-ministry-on-the-occasion-of-independence-day
telangana-officials-got-police-medals-from-union-home-ministry-on-the-occasion-of-independence-day

By

Published : Aug 14, 2021, 5:21 PM IST

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ అందించే పోలీస్ పతకాలకు రాష్ట్రానికి చెందిన పలువురు అధికారుల ఎంపికయ్యారు. ప్రెసిడెంట్ పోలీస్ సేవా పతకానికి ఇద్దరు, పోలీస్ శౌర్య పతకానికి 14 మంది, పోలీస్ సేవా పతకానికి 11 మందిని కేంద్ర హోంశాఖ ఎంపిక చేసింది.

అదనపు డీజీ స్వాతి లక్రా, జనగామ డీసీపీ బి.శ్రీనివాస్ రెడ్డికి ప్రెసిడెంట్ పోలీస్ సేవా పతకం దక్కింది. ఇంటెలిజెన్స్ డీఐజీ శివకుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ డి.రమేశ్, హన్మకొండ ఏసీపీ జితేందర్​రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్​లు పోలీస్​ సేవా పతకానికి ఎంపికయ్యారు.

ఇద్దరు ఆర్పీఎఫ్ అధికారులకు భారత్​ పోలీస్​ మెడల్స్​..

దక్షిణ మధ్య రైల్వేలోని ఆర్పీఎఫ్​కు చెందిన ఇద్దరు పోలీసులు ప్రతిష్ఠాత్మక భారత పోలీస్ మెడల్ పురస్కారం సాధించారు. గుంటూరు డివిజన్‌కు చెందిన డివిజినల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ (డీఎస్‌సీ) కె.ఎస్‌.హరప్రసాద్‌, సికింద్రాబాద్‌ పోస్ట్‌ ఇన్​స్పెక్టర్​ కె.బెనయ్య ఎంపికయ్యారు.

ధైర్యసాహసాలతో లక్షల విలువైన రైల్వే మెటీరియల్‌ను సంరక్షించడంలో హరిప్రసాద్ కీలకపాత్ర పోషించారని రైల్వే శాఖ ప్రశంసించింది. ఆయన 33 సంవత్సరాల సర్వీసులో అనేక ధైర్య సాహసాలు ప్రదర్శించారని రైల్వేశాఖ వెల్లడించింది. గుంటూరు డీఎస్‌సీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత... కరడుగట్టిన నేరగాళ్లను నివారించడంపై పోస్ట్ కమాండర్లకు మార్గదర్శిగా ఉన్నారని కొనియాడింది. ఆయన పర్యవేక్షణలో రైల్వే చట్టం 143 సెక్షన్‌ కింద 21 కేసులను నమోదు చేసి 22 మందిని అరెస్టు చేసి రూ.4.46 లక్షల విలువైన 481 రైల్వే టికెట్లను స్వాధీనం చేసుకున్నారని రైల్వేశాఖ తెలిపింది.

దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌ డివిజన్​లో పోస్ట్​ ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్న కె.బెనయ్యకు సైతం భారత పోలీస్ మెడల్ లభించింది. బెనయ్య తన 25 ఏళ్ల సర్వీసులో.. విలువైన రైల్వే ఆస్తులను రక్షించారని రైల్వే శాఖ కొనియాడింది. ఆయన అంతరాష్ట్ర యాలకుల ముఠాను ఛేదించారని రైల్వేశాఖ పేర్కొంది. బెనయ్య.. ప్రభుత్వ రైల్వే పోలీస్​, స్థానిక పోలీసు యంత్రాగంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ.. అంతర్రాష్ట్ర ముఠాల నుంచి లక్షల విలువైన వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకున్నారని వెల్లడించింది. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ సమయంలో శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు నడిపినప్పుడు బెనయ్య ఉత్సాహంగా విధుల్లో పొల్గొని.. అనేక సమస్యలను పరిష్కరించారని రైల్వే శాఖ ప్రశంసించింది. చిన్నారులను రక్షించడం, ప్రయాణికులు లగేజీని కాపాడడం, వృద్ధులు, మహిళలు, చిన్నారులకు సాయపడడంలో బెనయ్య కీలకపాత్ర పోషించారని రైల్వే అధికారులు తెలిపారు.

జోన్​కు చెందిన ఆర్పీఎఫ్‌ సిబ్బందికి పురస్కారాలు లభించడం పట్ల రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీచూడండి:భద్రతా వలయంలో ఎర్రకోట- రంగంలోకి షార్ప్ షూటర్లు

ABOUT THE AUTHOR

...view details