Telangana Nik Award: మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలానికి చెందిన దివ్యాంగుడు లింగప్ప 'తెలంగాణ నిక్' అవార్డును అందుకున్నాడు. టీహబ్‌లో బుధవారం(ఫిబ్రవరి 23న) జరిగిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సింపోజియం 2022 కార్యక్రమంలో లింగప్పకు టిటా అధ్యక్షుడు సందీప్ మక్తాల అవార్డును అందించారు. లింగప్పకు రెండు చేతులు లేకున్నా.. అన్ని పనులు చేయడంతో పాటు రాయడం, క్రికెట్‌లాంటి ఆటలు ఆడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడని సందీప్ మక్తాల ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.బండా ప్రకాశ్, జేఎన్టీయూ డైరెక్టర్ డా.గోవర్దన్, ఫీనిక్స్ గ్రూప్స్ డైరక్టర్ శ్రీకాంత్ బాడిగ, టీటా ప్రతినిధులు రాణాప్రతాప్ బొజ్జం, అశ్విన్ చంద్ర, రవి లెల్ల తదితరులు పాల్గొన్నారు.
నిక్‌కు ఏమాత్రం తీసిపోకుండా..
ఆస్ట్రేలియాలో జన్మించిన నిక్ వుజికిక్ బాల్యంలోనే తన రెండు చేతులను కోల్పోయినా.. ఆత్మస్థైర్యం కోల్పోకుండా కష్టపడి జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ, ఎందరికో స్పూర్తిగా నిలిచాడు. ‘నిక్’ మోటివేషనల్ స్పీకర్‌గా ఉంటూ, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది యువతకు స్పూర్తిగా నిలుస్తున్నాడు. ఆయన పేరు మీద పదో తరగతిలో పాఠ్యాంశం కూడా ఉంది. నిక్‌కు ఏమాత్రం తీసిపోకుండా, అన్ని పనులు చేసుకుంటూ, ఇటు చదువుతోపాటు ఆటల్లోనూ లింగప్ప అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు.