తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today టాప్​ న్యూస్​ 9PM - 9PM టాప్​ న్యూస్​

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Aug 15, 2022, 8:58 PM IST

  • బీదర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

కర్ణాటకలోని బీదర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కంటైనర్‌ను వెనకనుంచి ఢీకొన్న ఘటనలో చిన్నారి సహా ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

  • అవినీతి, కుటుంబ పాలనను ఏరిపారేయాలి, సవాళ్లున్నా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి

స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఆత్మనిర్భర్ భారతావని లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. శతాబ్ది వేడుకలు జరుపుకునే నాటికి స్వయంసమృద్ధ దేశంగా అవతరించాల్సిందనేని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని తేల్చిచెప్పారు.

  • సంక్షేమ పథకాలు ఉచితాలంటూ కేంద్రం అపహాస్యం చేస్తోందన్న కేసీఆర్

విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తున్న వారి కుట్రలను సమర్ధంగా తిప్పికొట్టేందుకు మేధావులు, యువత సహా అన్నివర్గాలు కదలిరావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అన్నిరకాలుగా అభివృద్ధిలో దూస్తుకెళ్తున్న రాష్ట్రాన్ని.. ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు సరికాదంటూ ఆక్షేపించారు.

  • ప్రజా సంగ్రామ యాత్రలో డిష్యూం డిష్యూం, పోలీస్ కమిషనర్ తీరుపై బండి ఫైర్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనగామ జిల్లా దేవరుప్పలో తెరాస, భాజపా శ్రేణులు పరస్పరం రాళ్లదాడి చేసుకోగా... ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది.

  • తుమ్మల అనుచరుడి హత్యతో ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో దారుణహత్య కలకలం రేపుతోంది. తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్యను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో అత్యంత పాశవికంగా హత్య చేశారు.

  • ఈనెల 20 నుంచి మునుగోడులోనే ఉంటానని కార్యకర్తలకు రేవంత్ రెడ్డి భరోసా

మునుగోడులో సర్పంచ్​లు, ఎంపీటీసీలను తెరాస కొనుగోలు చేస్తోందని.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కోవిడ్ వల్ల మునుగోడు వెళ్లలేకపోయినట్లు ఆయన చెప్పారు. ఈనెల 20 నుంచి మునుగోడులోనే ఉంటానని రేవంత్ రెడ్డి తెలిపారు.

  • గర్ల్​ఫ్రెండ్​తో చాటింగ్, ఆరు గంటలు ఆగిపోయిన విమానం

ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య సరదాగా జరిగిన చాటింగ్ ఏకంగా ఆరు గంటలపాటు ఓ విమానాన్ని నిలిపివేసింది. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో జరిగింది. అసలేం జరిగిందంటే

  • ఎస్​బీఐ రుణాలు ఇక మరింత భారం, మరోసారి వడ్డీ రేట్లు పెంపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచి రుణ గ్రహీతలకు షాకిచ్చింది. పెంచిన వడ్డీ రేట్లు ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐలు మరింత భారం కానున్నాయి.

  • ధోనీ విషయంలో బీసీసీఐ నిర్ణయంపై ఐపీఎల్​ ఫ్రాంచైజీలు అసహనం

విదేశీ లీగ్స్‌లో భారత ఆటగాళ్లను అనుమతించకపోవడం సరైన నిర్ణయం కాదని ఐపీఎల్​ ఫ్రాంచైజీలు అభిప్రాయపడుతున్నాయి. ఇలా చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయేది ఉంటుందని అంటున్నాయి.

  • లైగర్​ సినిమాతో ఆ కోరిక తీరిందన్న విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన పాన్​ ఇండియా చిత్రం 'లైగర్‌'. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో దూకుడు పెంచిన 'లైగర్‌' టీమ్​ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది.

ABOUT THE AUTHOR

...view details