తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @ 3PM - 3PM టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS

By

Published : Aug 9, 2022, 2:58 PM IST

  • ప్రతిపాదనలు అంగీకరిస్తే భాజపాలో చేరేందుకు సిద్ధం: జయసుధ

ఈనెల 21న తాను భాజపాలో చేరడం లేదని జయసుధ స్పష్టం చేశారు. అయితే తాను పార్టీ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్లు వాటిని అంగీకరించినట్లయితే.. భాజపాలో చేరేందుకు సిద్ధమని ఆమె తెలిపారు.

  • 'మార్పు'నకు ముహూర్తం ఫిక్స్!

బిహార్​లో జేడీయూ-ఆర్​జేడీ-కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా చకచకా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్.. సాయంత్రం 4 గంటలకు గవర్నర్​ను కలవనున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పాదయాత్ర ప్రారంభించి.. రాజ్​భవన్​కు వెళ్తారని సమాచారం.

  • పెద్దల సభకే 'సమయం' నేర్పిన నేత.. వెంకయ్యనాయుడు

"ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వాలు విజయవంతంగా అమలు చేయాలంటే పార్లమెంట్ బిల్లులను సకాలంలో ఆమోదించాలి. దానికి అనుగుణంగా సభ్యులు హుందాగా నడుచుకోవాలి". 2017లో భారతదేశ ఉపరాష్ట్రపతిగా బాధ్యతల స్వీకరణకు ముందురోజు వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలివి.

  • వెంటనే 50 లక్షల కొవిషీల్డ్ డోసులు పంపండి : కేంద్రానికి హరీశ్​ లేఖ

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్​సుక్​ మాండవీయకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. ప్రికాషనరీ డోసులు ఇస్తున్న నేపథ్యంలో.. డిమాండ్​కి తగినమొత్తంలో కొవిడ్ టీకా డోసులు అందుబాటులో లేవని తెలిపారు. రాష్ట్రానికి తక్షణమే 50 లక్షల కొవిషీల్డ్ టీకాలు పంపాలని కోరారు.

  • పడుకుని లేచేసరికి ఆర్టీసీ బస్సు మాయం.. అంతలోనే..!

విధులు ముగిశాక బస్సు పార్క్ చేసి.. డ్రైవర్​, కండక్టర్​​ నిద్రపోయారు. పొద్దున్నే లేచి డ్యూటీ ఎక్కుదామని చూస్తే బస్సు కనిపించలేదు. పడుకుని లేచేసరికి ఏకంగా బస్సు మాయం కావటంతో డ్రైవర్​, కండక్టర్​ షాకయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

  • నితీశ్​ ప్లాన్​కు భాజపా కౌంటర్.. ఆ ఎమ్మెల్యేలపై వేటు!..

బిహార్​లో జేడీయూ ప్రణాళికలకు భాజపా కౌంటర్ వ్యూహాలు రచిస్తోంది. ఆర్జేడీతో కలిసి జేడీయూ ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో.. కమలదళం అలర్ట్ అయింది. ఆర్జేడీ ఎమ్మెల్యేలపై వేటు పడేలా పావులు కదుపుతోంది.

  • నాయకులెవరూ లేని వేళ 'అరుణో'దయం.. క్విట్​ ఇండియాకు శ్రీకారం

ఆంగ్లేయుల జైలు నుంచి విడుదల అనగానే ఎవరైనా సంబరపడి వెళ్లిపోతారు. కానీ విడిచి పెట్టినా వందలమంది జైల్లో అలాగే ఉండిపోయారు. కారణం- అరుణ! మహాత్ముడి నుంచి మామూలు కార్యకర్త దాకా అందరినీ కదిలించిన స్వాతంత్య్ర సమరయోధురాలు అరుణా అసఫ్‌ అలీ!

  • కొత్త రూల్స్​తో చెక్కులకు అదనపు భద్రత

డిజిటల్‌ చెల్లింపులు జోరందుకున్నప్పటికీ.. అధిక విలువగల లావాదేవీలకు ఇప్పటికీ చెక్కులు కీలకంగానే ఉన్నాయి. చెక్కులో పేర్కొన్న మొత్తాన్ని దిద్దడం, ఫోర్జరీ సంతకాలు వంటి ఇబ్బందులున్నప్పటికీ.. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఇవి ఎంతో ప్రధానమైనవిగానే చెప్పొచ్చు. ఈ మోసాలకు తావు లేకుండా ఇప్పుడు పాజిటివ్‌ పే సిస్టమ్‌ (పీపీఎస్‌) అందుబాటులోకి వచ్చింది.

  • స్క్రీన్​షాట్​ బ్లాక్​, హైడ్ ఆన్​లైన్​ స్టేటస్.. వాట్సాప్​లో సూపర్​ ఫీచర్స్​!

యూజర్ల ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని కీలక మార్పులు చేస్తోంది వాట్సాప్. గ్రూప్​ల నుంచి సైలెంట్ ఎగ్జిట్, స్క్రీన్​షాట్ బ్లాకింగ్, రెండు రోజుల తర్వాత కూడా మెసేజ్ 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' వంటి ఆప్షన్లు తీసుకొస్తోంది.

  • హీరో నిఖిల్ టీమ్​కు షాక్.. పాక్ బోర్డర్లో షూటింగ్ చేస్తుంటే...

'కార్తికేయ 2' ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆగస్టు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో భాగంగా ఆలీతోసరదాగా కార్యక్రమానికి నిఖిల్​, చందూ మొండేటి గెస్టులుగా విచ్చేసి సినిమా షూటింగ్​కు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ క్రమంలోనే పాక్​ బోర్డర్​లో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి....

ABOUT THE AUTHOR

...view details