1.తెలంగాణలో ఇద్దరికి కొత్తరకం కరోనా
బ్రిటన్‌లో వెలుగుచూసి ప్రపంచ దేశాలను భయపెడుతోన్న కరోనా 'కొత్త రకం' వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. ఇటీవల యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్తగా మార్పు చెందిన కరోనా వైరస్ ఉన్నట్లు తాజాగా తేలింది. బెంగళూరులోని నింహన్స్‌లో మూడు, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో రెండు, పుణెలోని ఎన్ఐవీలో ఒక కేసు నిర్ధరణ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం అధికారంగా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
2.రాష్ట్రంలో కొత్తగా 397 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 397 కరోనా కేసులు, 2 మరణాలు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం బాదితుల సంఖ్య 2,85,465కు చేరింది. ఇప్పటి వరకు వైరస్‌తో 1,535 మంది మరణించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
3.అమెరికాలో మరిన్ని టీకాలు!
అమెరికాలో మరిన్ని టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న టీకాలతో అందరికీ సత్వరమే వ్యాక్సిన్ అందించడం సాధ్యపడదని నిపుణులు చెబుతున్నారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌ను టీకా అడ్డుకుంటుందా అనే విషయంపై అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
4.సాగు చట్టాల రద్దుపైనే మాట్లాడతాం
ఎముకలు కొరికే చలిలోనూ పట్టుసడలని రైతులు.. తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. దిల్లీ సరిహద్దులో బైఠాయించారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం కేంద్రంతో చర్చలు జరగనుండగా.. సాగు చట్టాల రద్దుపైనే మాట్లాడతామని రైతులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
5. భర్తకు దేహశుద్ధి
భార్య దేన్నయినా భరిస్తుంది అనుకోవడం పొరపాటు. ఏదైనా ఓపిక పట్టిన్నంత కాలమే. తాగొచ్చి వేధిస్తున్న భర్తలో మార్పు వస్తుందేమోనని ఎదురుచూసింది. కానీ ఫలితం లేదని భావించిన ఆ ఇల్లాలు.. బజార్లోకి లాక్కొచ్చి కట్టేసి చితకబాదింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి