గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 68,097 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 298 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మహమ్మారి బారిన పడి ఇద్దరు మరణించారు. వైరస్‌తో పోరాడి మరో 325 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,476 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 6 లక్షల 60 వేల 142 కరోనా కేసులు నమోదు కాగా... 3 వేల 888 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 6 లక్షల 50 వేల 778 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు వైద్య శాఖ వెల్లడించింది.