Telangana National Unity Vajrotsavam ktr speech: తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చ పొందడానికి ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందని..ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలుస్తాయని ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఆనాటి ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆదివాసి యోధుడు కుమురంభీం, తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమురయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహానీయులు రావి నారాయణరెడ్డి, స్వామి రామానంద తీర్ధ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ వంటి ప్రజానేతల త్యాగాలను స్మరించుకొందామని కేటీఆర్ గుర్తు చేశారు.