Shaikpet Flyover Inauguration : హైదరాబాద్ షేక్పేట్ పైవంతెనను ఇవాళ.. రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. నూతన సంవత్సర బహుమతిగా ఉదయం 11.30 గంటలకు పైవంతెనకు శ్రీకారం చుట్టనున్నారు. నగరంలో పొడవైన వంతెనల్లో షేక్పేట్ పైవంతెన ఒకటి. రూ.335 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. టోలిచౌకి నుంచి ఖాజాగూడ కూడలి ఈ నిర్మాణం చేశారు. మొత్తం 2.8 కిలోమీటర్ల పొడవున 6 లైన్లు విస్తరించి ఉంది. ఈ వంతెనతో మెహదీపట్నం-హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
Shaikpet Flyover Inauguration : పైవంతెన ప్రారంభంతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నాం: కేటీఆర్ - shaikpet flyover inauguration by KTR
Shaikpet Flyover Inauguration : హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి మరో పైవంతెన నిర్మాణమయింది. నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ షేక్పెట్ పైవంతెనను ఇవాళ ప్రారంభించనున్నారు. పాత-కొత్త నగరాలను కలిపే ఈ వంతెన ట్రాఫిక్ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు.
Shaikpet Flyover Inauguration
మరో మైలురాయి..
KTR Tweet on Shaikpet Flyover : నేడు పాత, కొత్త నగరాలను కలిపే పైవంతెన ప్రారంభంతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నామని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ వంతెనను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. టోలిచౌకి నుంచి రాయదుర్గాన్ని కలుపుతూ ఈ వంతెనను నిర్మించినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయిగా ఈ వంతెన నిలుస్తుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.