జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉన్నతస్థాయికి ఎదిగారు వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన కామిరెడ్డి నర్సింహారెడ్డి. ఎంత ఉన్నతస్తాయిలో ఉన్నా... కన్న తల్లి, పుట్టిన ఊరును మరిచిపోకూడదనే మాటను ఆచరణలో పెట్టారు. తన గ్రామానికి రూ.25 కోట్ల విరాళం అందించి... తాను జన్మించిన పల్లెను ప్రగతి పథంలో నడిపించారు.
సొంతూరుకు రూ.25 కోట్లు.. శ్రీమంతుడికి కేటీఆర్ ప్రశంస - సొంత గ్రామానికి రూ.25 కోట్లు ఇచ్చిన కేఎన్ఆర్
శ్రమను నమ్మకుని అంచెలంచెలుగా ఉన్న స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన కామిరెడ్డి నర్సింహారెడ్డి తన సొంత గ్రామాభివృద్ధికి రూ.25 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. పుట్టిన ఊరికి ఎంతో కొంత తిరిగిచ్చేయాలన్న ఆయన ఆశయం ఎంతో గొప్పదని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. మరెందరికో ఆయన సేవలు స్పూర్తినివ్వాలని ఆకాంక్షించారు.
'మీ మార్గం... ఎందరికో ఆదర్శం'
ఆయన సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రశంసించారు. నేడు మంత్రి కేటీఆర్ కేఎన్ఆర్కు పుష్ప గుచ్ఛం అందజేసి అభినందించారు. తను పుట్టి పెరిగిన పల్లె ప్రగతికి రూ.25 కోట్లు ఆర్థిక సాయం అందించిన కేఎన్ఆర్ దాతృత్వాన్ని కొనియాడారు. ఆయన సేవలు మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.
- సంబంధిత కథనం :మనుష్యులందు కేఎన్ఆర్ కథ.. మహర్షి లాగ సాగదా..!