పురపాలక ఎన్నికల రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తైంది. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో వార్డుల రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఆయా వర్గాల వారీగా వార్డు పదవుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 2011 జనాభా ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఎస్టీల జనాభా ఒకశాతానికి తక్కువగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లోనూ ఒక వార్డును వారికి రిజర్వ్ చేశారు. 50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లు కల్పించారు. అన్ని కేటగిరీల్లోనూ సగం సీట్లను మహిళలకు కేటాయించారు.
| ఎస్టీ | ఎస్టీ మహిళ | ఎస్సీ జనరల్ | ఎస్సీ మహిళ | బీసీ జనరల్ | బీసీ మహిళ | జనరల్ | |
జనరల్
మహిళ
కరీంనగర్(60) | 1 | - | - | 3 | 12 | 11 | 14 | 16 |
రామగుండం(50) | 1 | | 6 | 5 | 7 | 6 | 11 | 14 |
బడంగ్‌పేట(32) | 1 | | 3 | 2 | 5 | 5 | 7 | 9 |
మీర్‌పేట(46) | 2 | 1 | 4 | 3 | 7 | 6 | 10 | 13 |
బండ్లగూడ జాగీర్(22) | 2 | | 2 | 1 | 4 | 3 | 4 | 7 |
బోడుప్పల్(28) | 1 | | 2 | 1 | 5 | 5 | 6 | 7 |
పీర్జాదిగూడ(26) | 1 | | 1 | 1 | 5 | 5 | 6 | 7 |
జవహర్‌నగర్(28) | 1 | | 3 | 2 | 4 | 4 | 6 | 8 |
నిజాంపేట(33) | 1 | | 1 | 1 | 7 | 6 | 8 | 9 |
ధర్మపురి(15) | 1 | | 1 | 1 | 2 | 2 | 4 | 4 |
రాయికల్(12) | 1 | | 1 | 1 | 2 | 2 | 2 | 4 |
మెట్‌పల్లి(26) | 1 | | 2 | 1 | 5 | 4 | 5 | 8 |
కోరుట్ల(33) | 1 | | 2 | 1 | 6 | 6 | 8 | 9 |
జగిత్యాల(48) | 1 | | 2 | 2 | 10 | 9 | 11 | 13 |
ఎన్నికలు జరగనున్న పది కార్పొరేషన్లలో 385 కార్పొరేటర్ పదవులు, 120 మున్సిపాల్టీల్లో 2,727 కౌన్సిలర్ పదవుల రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఈ మేరకు రిజర్వేషన్ల వివరాలను కలెక్టర్లకు పురపాలక శాఖ జిల్లా పంపింది. వాటి ఆధారంగా రేపు వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.
కార్పొరేషన్ల మేయర్, మున్సిపాల్టీల ఛైర్మన్ల పదవుల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా సాయంత్రానికి పూర్తి కానుంది. ఆయా వర్గాల వారీగా దక్కే మేయర్, ఛైర్ పర్సన్ల పదవుల వివరాలు తేలుతాయి. మేయర్, ఛైర్ పర్సన్ పదవుల తుది రిజర్వేషన్లు కూడా రేపు ఖరారు కానున్నాయి.