తెలంగాణ

telangana

ETV Bharat / city

నిజామాబాద్​లో ఎక్కువ... వడ్డేపల్లిలో తక్కువ - తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు

పురపాలిక ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో తుది అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. 3,052 వార్డులకు గానూ 12,956 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

telangana municipal elections
telangana municipal elections

By

Published : Jan 15, 2020, 9:06 PM IST

Updated : Jan 15, 2020, 11:38 PM IST

అభ్యర్థుల తుది జాబితా

పురపాలక ఎన్నికల్లో 12,956 మంది పోటీ పడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడించింది. మొత్తం 120 పురపాలక సంఘాలు, తొమ్మిది నగరపాలక సంస్థల్లో 3,052 వార్డుల్లో, డివిజన్లల్లో ఏకగ్రీవాలతో కలిపి 12,956 మంది బరిలో ఉన్నట్లు ప్రకటించింది. అత్యధికంగా నిజామాబాద్‌ నగరపాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లల్లో 415 మంది, రామగుండం పురపాలక సంఘం పరిధిలోని 50 వార్డుల్లో 355 మంది, ఆదిలాబాద్‌ పురపాలక సంఘం పరిధిలో 49 వార్డుల్లో 286 మంది పోటీలో ఉన్నారు.

అతి తక్కువగా

అతి తక్కువగా వడ్డేపల్లి మున్సిపాలిటీలోని పది వార్డుల్లో కేవలం 29 మంది పోటీ పడుతున్నారు. చెన్నూరు పురపాలక సంఘం పరిధిలో 18 వార్డుల్లో 33 మంది, ఆత్మకూరు 10 వార్డుల్లో 36 మంది, అమర్చింత 10 వార్డుల్లో 40 మంది, పరకాల 22 వార్డుల్లో 44 మంది, తిరుమలగిరి 15 వార్డుల్లో 45 మంది, తొర్రూరు 16 వార్డుల్లో 46 మంది, చిట్యాల 12 వార్డుల్లో 47 మంది, యాదగిరి గుట్ట 12 వార్డుల్లో 48 మంది, అలంపూర్‌లో పది వార్డుల్లో 48 మంది, ఆదిబట్ల 15 వార్డుల్లో 49 మంది లెక్కన పోటీ పడుతున్నారు.

పార్టీల వారీగా...

పార్టీల వారీగా జాబితా

ఇదీ చూడండి: సిరిసిల్లలో నేను చేయాల్సిన పని ఇదే: కేటీఆర్

Last Updated : Jan 15, 2020, 11:38 PM IST

ABOUT THE AUTHOR

...view details