తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana MPs On Budget: 'పీఎం కిసాన్ నిధుల కన్నా.. కేసీఆర్ రైతు బంధు నిధులే ఎక్కువ' - తెరాస ఎంపీలు

Telangana MPs On Budget: కేంద్ర బడ్జెట్​లో కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించి.. తెలంగాణకు మొండి చేయి చూపించారని తెరాస ఎంపీలు ఆరోపించారు. కేంద్ర బడ్జెట్​ పూర్తిగా ప్రజా వ్యతిరేకమని.. దళితుల సంక్షేమం భాజపాకు ఏమాత్రం పట్టదని దుయ్యబట్టారు.

Telangana MPs Response On union Budget 2022
Telangana MPs Response On union Budget 2022

By

Published : Feb 2, 2022, 5:21 PM IST

Telangana MPs On Budget: దేశంలోనే అన్ని రంగాల్లో ముందున్న తెలంగాణకు కేంద్రం వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని తెరాస ఎంపీలు దిల్లీలో ఆరోపించారు. కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించారని ఆక్షేపించారు. కేంద్ర బడ్జెట్​పై మాట్లాడే హక్కు సీఎం కేసీఆర్​కు ఉందని ఎంపీ రంజిత్​రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారో 2014లో చెప్పటమే కాకుండా.. వాటిని చేసి చూపించిన వ్యక్తి కేసీఆర్ అని వివరించారు.

రెండు నిమిషాలు మాట్లాడితే చాలా..

"తెలంగాణకి ఏం చేయాలనుకుంటున్నారో 2014లో చెప్పి.. వాటిని చేసి చూపించిన వ్యక్తి కేసీఆర్. కేంద్రం ఇప్పుడు చెప్తున్నవి... తెలంగాణలో కేసీఆర్ ముందే చేసి చూపించారు. దేశంలో 5 ట్రిలియన్ ఎకానమీ తీసుకువస్తామని ఐదేళ్ళ క్రితం భాజపా చెప్పింది. కానీ.. ఇప్పటికీ అక్కడే ఉంది. 375 లక్షల కోట్ల బడ్జెట్ పెడితేనే 5 ట్రిలియన్ ఎకానమీ సాధించినట్టు. తెలంగాణ బడ్జెట్ రెట్టింపు అయింది... అదీ టార్గెట్ ఓరియెంటెడ్ అప్రోచ్ అంటే. రాష్ట్రం ఏర్పడిన 7 ఏళ్లకే తెలంగాణ జీడీపీ రెట్టింపయ్యింది. ధాన్యం కొనుగోళ్ల గురించి ముందే చెప్పండని కోరుతున్నా... కేంద్రం చెప్పడం లేదు. పీఎం కిసాన్ నిధుల కన్నా.. కేసీఆర్ రైతు బంధు నిధులే ఎక్కువున్నాయి. ఎమ్మెస్పీకి నిధులు పెట్టాం అంటే సరిపోదు.. ధాన్యం సేకరణ పాలసీ రూపొందించాలి. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు నిధులు ఇచ్చుకున్నారు. కానీ.. తెలంగాణకు ఏ రంగంలో సరైన కేటాయింపులు చేయలేదు." - రంజిత్ రెడ్డి, తెరాస ఎంపీ

కార్పొరేట్లకే సాత్​.. దేశ్​ కా వినాష్​..

కేంద్ర బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని ఎంపీ వెంకటేశ్​ నేత అన్నారు. దేశంలో 40 కోట్లు ఉన్న ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్​లో నిధులు కేటాయించలేదన్నారు. దళితుల సంక్షేమం భాజపాకు ఏ కోశాన పట్టదని దుయ్యబట్టారు. బడ్జెట్​లో తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించనుందుకు కాంగ్రెస్, భాజపా నేతలు రాష్ట్రంలో కాదు దిల్లీలో ప్రధాని కార్యాలయం ముందు నిరసనలు చేయాలని డిమాండ్​ చేశారు.

"అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు గురించి సీఎం కేసీఆర్​పై భాజపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రాంగణం వెనుక అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి. ఆరోగ్య రంగానికి నిధులు కేటాయించలేని స్థితిలో భాజపా ఉంది. దళితులు, బీసీలు, మైనారిటీలు, రైతులను పట్టించుకోవడం లేదు. దేశంలో కరోనా పరిస్థితుల వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. దేశాన్ని అమ్మేందుకే భాజపా ప్రయత్నం చేస్తుంది. కార్పొరేట్లకే సాత్.. దేశ్ కా వినాష్ అన్నట్టుగా భాజపా వ్యవహరిస్తోంది. భాజపాకు రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. రాష్ట్రాలపై పెత్తనం చేయడానికే భాజపా ప్రయత్నిస్తుంది."-వెంకటేష్ నేత, తెరాస ఎంపీ

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details