తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు తెలంగాణ మంత్రులు కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. ఉదయమే కేటీఆర్, హరీశ్‌రావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ , శ్రీనివాస్‌గౌడ్‌లు వారి కుటుంబ సభ్యులతో సహా స్వామి వారిని దర్శించుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా వారి భార్యాపిల్లలతో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి సన్నిధిలో 'మన' మంత్రులు... - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు సందర్శించారు. ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీవారి సన్నిధిలో 'మన' మంత్రులు...
రెండు రాష్ట్రాల ప్రజలందరూ సంతోషంగా గడపాలని స్వామి వారిని కోరుకుంటున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: సీఎం స్వీట్ వార్నింగ్: ఒక్కటి ఓడినా... పదవులు ఊడతయ్!