Telangana Ministers Delhi Tour: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ దిల్లీ వెళ్లారు. యసంగి వరి దాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు మాట్లాడిన మాటలు అర్థరహితమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వరి దాన్యం కొనుగోలుపై ఏమైనా మాట్లాడితే ఆ శాఖ మంత్రి, లేదంటే సంబంధిత అధికారులు మాట్లాడాలని బండి సంజయ్‌కి ఎం సంబంధమని ప్రశ్నించారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తరఫున మాట్లాడితే స్పష్టమైన హామీతో మాట్లాడాలని.. ఇష్టం వచ్చినట్లు కాదని స్పష్టం చేశారు.
పంజాబ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ధాన్యం కొంటున్నారో ఇక్కడ కూడా అదేవిధంగా కొనుగోలు చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వడ్లనే కొంటాం ఆ వడ్లనే కొంటాం అంటే ఎలా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడం సరికాదని అన్నారు. బండి సంజయ్ రాష్ట్రం కోసం ఎం చేస్తున్నారు? రాష్ట్రానికి ఎం ఒరిగిందని నిలదీశారు.