సీఎం కేసీఆర్‌తో కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల, ఎంపీలు (Ministers meet cm kcr) సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాల సారాంశాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించారు.
Ministers meet cm kcr: దిల్లీలో సీఎం కేసీఆర్‌తో సమావేశమైన మంత్రులు, ఎంపీలు - కేసీఆర్ దిల్లీ పర్యటన

20:44 November 23
సీఎం కేసీఆర్‌తో సమావేశమైన మంత్రులు, ఎంపీలు
కేంద్రమంత్రులతో భేటీ..
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రానికి చెందిన మంత్రులు (ts ministers met union ministers) కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, పలువురు ఎంపీలు.. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్‌తో సమావేశమయ్యారు. ధాన్యం సేకరణపై చర్చించారు. కొన్ని విజ్ఞప్తులపై కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఏడాది మొత్తం మీద రెండు సీజన్లలో 100 నుంచి 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని మంత్రుల బృందం కోరింది. అలా కాకుండా.. ఏ సీజన్‌లో ఎంత ఉత్పత్తి ఉంటుందో చెప్పాలని కేంద్రమంత్రులు అడిగినట్లు సమాచారం. కేంద్ర మంత్రులు కొన్ని విషయాలపైనే సానుకూలంగా స్పందించారని.. కొన్నింటిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదని తెలిసింది.
రెండు సీజన్లలో ఎప్పుడు ఎంత ఉత్పత్తి అవుతుందో.. ఒక నిర్దిష్ట అంచనాతో వస్తే.. ఒక నిర్ణయానికి రావొచ్చని పీయూష్ గోయల్ అన్నట్లు సమాచారం. ఈనెల 26న మరోసారి కూర్చొని.. అన్ని విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుందామని పీయూష్ గోయల్ చెప్పినట్లు సమావేశంలో పాల్గొన్న ఎంపీలు తెలిపారు.
ఇవీచూడండి:ktr to meet piyush goyal: ధాన్యం సేకరణ విషయం తేలకుండానే ముగిసిన భేటీ