KTR Comments on JP Nadda: దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. తెరాస పాలనపై మహబూబ్‌నగర్ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
KTR on JP Nadda: 'దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి మాపై విమర్శలా..?' - జేపీ నడ్డా గురించి కేటీఆర్ ట్వీట్
KTR on JP Nadda :మహబూబ్‌నగర్ సభలో తెరాస పాలనపై భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శల్ని మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. దేశ ఆర్ధిక వ్యవస్థను భ్రష్టుపట్టించిన వారు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో 45 ఏళ్లలోనే నిరుద్యోగం గరిష్ఠానికి చేరిందని కేటీఆర్ విమర్శించారు.
KTR on JP Nadda
KTR Tweet Today: మోదీ పాలనలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠానికి చేరిందని కేటీఆర్ విమర్శించారు. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌లోనే వంట గ్యాస్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆక్షేపించారు. దేశానికి, రాష్ట్రానికి ఏమీ చేయని భాజపా నేతలు తెలంగాణకు వచ్చి తెరాస పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని కేటీఆర్ మండిపడ్డారు.