తెలంగాణలో లాక్డౌన్ విధించే ఆలోచన లేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కేసులు విపరీతంగా పెరిగితే చెప్పేలమని అన్నారు. సాగర్ ఎన్నికల సమయంలో కరోనా ఇంత తీవ్రంగా లేదని చెప్పారు. భాజపా అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. వ్యాక్సిన్ ధరల విధానం అసంబద్ధంగా ఉందని మండిపడ్డారు.
కొవిడ్ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని
భాజపా అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచన లేదన్న మంత్రి.. కేసులు విపరీతంగా పెరిగితే చెప్పలేమన్నారు.
తెలంగాణ లాక్డౌన్, తెలంగాణలో నో లాక్డౌన్, మంత్రి తలసాని, తలసాని
కొవిడ్ మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని మంత్రి అన్నారు. దిల్లీ, మహారాష్ట్ర తరహా పరిస్థితి రాష్ట్రంలో లేదని చెప్పారు.